Junior Chiru: చిరంజీవిలా ఉండటమే నాకు శాపం
Junior Chiru: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తెలియనివాళ్ళు ఎవరు వుండరు. మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదిగి బాస్ గా ఎదిగారు. అయితే టాలీవుడ్ కు ఏదైన సమస్య అయితే దాన్ని పరిష్కరించడంలో పెద్ద కొడుకులా బాధ్యత తీసుకుని అడుగు ముందుకు వేస్తారు.
నటన పరంగా ఆయన ఒక శిఖరం. ఆయన అంతా ఎత్తుకు ఎదగడం అనే మాట పక్కన పెడితే రూపంలో ఆయన పోలికలు ఉంటే ఎంతో సంబరపడతారు. కానీ బుల్లి తెర హీరో మాత్రం చిరంజీవి పోలికలతో ఉండటం శాపంగా మారిందని అంటున్నారు Junior Chiru. పూర్తి వివరాల్లోకి వెళితే
బుల్లి తెర హీరో రాజ్ కుమార్ (Junior Chiru)నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో ఆయన నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సీరియల్ నటుడు రాజ్ కుమార్ ఆయన్ను ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పిలిచేవారు. చూడటానికి అచ్చం మెగాస్టార్ చిరంజీవిలా ఉండటంతో అలా పిలిచేవారు. దర్శక నిర్మాత దాసరి నారాయణరావు శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అమ్మ రాజీనామా సినిమాతో రాజ్ కుమార్ హీరోగా పరిచయం అయ్యారు. నాగబాల, సంసారాల మెకానిక్, కాలేజీ బుల్లోడు ఇలా పలు చిత్రాల్లో నటించారు. తర్వాత బుల్లితెరపై అలరించారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవిలా ఉండటం వల్లే తనకు పెద్ద మైనస్ అయిందని చెప్పుకొచ్చారు రాజ్ కుమార్.
కెరియర్ మంచి పీక్స్‌లో ఉన్న టైంలో ఇతను చిరంజీవిలా ఉంటాడంటూ వచ్చిన కామెంట్లే ఇతని కెరియర్‌ని దెబ్బకొట్టింది. ఈ విషయాన్ని స్వయంగా రాజ్ కుమార్ (Junior Chiru) తెలియజేశారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ రాజ్ కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నేను ఈ విషయాన్ని చాలా ఓపెన్‌గా చెప్తాను.. ఏ హీరోకి అయినా స్టార్ డమ్‌తో పాటు బ్రేకింగ్ పాయింట్ ఉండాలి. నాకు ఆ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్రేక్ పడిన విషయం ఏంటంటే.. నేను చిరంజీవిలా ఉండటం.
చిరంజీవిలా ఉన్నాడు భలే బాగున్నాడు అని అనడం బయట సొసైటీ వరకూ బాగానే ఉంటుంది కానీఇండస్ట్రీలోకి వచ్చేసరికి మీరు ఏం చేసినా కూడా అదే మాట వస్తుంది. చిరంజీవిలా ఉండటం మంచిదో చెడ్డదో నాకు తెలియదు.
తన బాధని వ్యక్తం చేసిన Junior Chiru
ఇప్పుడు కూడా నేను అలాగే ఉండొచ్చు. కానీ చిరంజీవిలాగా ఆ ‘లాగా’లో చాలా అర్ధాలు వస్తాయి. లాగ ఉంటాయి తప్పితే ఆయన అదృష్టానికి స్టార్ డమ్‌కి మనం సరిపోం. అక్కడ ఆ పాయింట్ దగ్గర నాకు బాగా మైనస్ అయ్యింది. నేను శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ ఇలా ఏడెనిమిది మంది హీరోలంతా ఒకటే టైంలో వచ్చాం. అందరి కంటే నేను ముందు నా కెరియర్ స్టార్ట్ అయ్యింది. తరువాత వాళ్లు నన్ను దాటి వెళ్లిపోయారు.
ఎందువల్ల అంటే నేను చిరంజీవిలా ఉండటమే నేను ఏం చేసినా చిరంజీవిలాగే కనిపిస్తుంది. మాట్లాడటానికి బాగుంటుంది కానీ కెరియర్ పరంగా కలిసిరాలేదు.ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయనకి డాన్స్ నేర్పే వాళ్లే నాకూ నేర్పేవాళ్లు. ఆ సినిమా రిలీజ్ అయితే.. నా సినిమా రిలీజ్ అయ్యేది. ఆయనతో నన్ను కంపేర్ చేసేవారు. ఆయన ఒక శిఖరం అలాంటి వ్యక్తితో పోల్చడం వల్ల మర్రిచెట్టు కింద కలుపుమొక్కలా అయిపోయింది నా కెరియర్. ఆనందించాలో బాధపడాలో నాకే అర్ధం కావడం లేదు.
చిరంజీవితో పోల్చడం వల్ల నేను మామూలు ఇబ్బందులు పడలేదు. చిరంజీవిలా కనిపించకుండా ఉండటం కోసం మీసాలు కూడా తీసేశాను. నా సొంత సినిమాలో మీసాలు తీసేసి నటించాను.
అందుకే తెలుగు ఇండస్ట్రీ వదిలి కర్ణాటక వెళ్లిపోయా పోనీ అక్కడైనా సినిమాలు చేసుకుందామా? అంటే అదీ కురర్లేదు అక్కడా ఇదే పరిస్థితి కన్నీళ్లతో కూడిన ఆనందం ఒకరకంగా ఆయనలా ఉండటం హ్యాపీ. కానీ ఇండస్ట్రీకి అది పనికిరాదు.
మిమ్మల్ని తొక్కేశారు సార్ అని చాలామంది అంటారు. వాళ్లకి ఒక్కటే చెప్పాను. తొక్కేవాళ్లే అయితే కనిపించకుండా చేస్తారు. టీవీలోకి కూడా రానివ్వరని. వాళ్లు కన్నెర్రజేస్తే సినిమా కాదు టీవీ కాదు యూట్యూబ్‌లో కూడా కనిపించము. ఆయన మనల్ని గుర్తుపెట్టుకునేటంత ఖాళీగా ఏమీ లేరు. చాలా సందర్భాల్లో ఆయన నన్ను పిలిచి మాట్లాడేవారు. బాగా చేస్తున్నావ్ ఇంకాచెయ్ అని అంటాడు. ఇప్పటికీ జూనియర్ చిరంజీవి అనే గోల ఉంది’ అని చెప్పుకొచ్చారు రాజ్ కుమార్ మొత్తానికి చిరంజీవిలా ఉండటం ఒకరకంగా వరం అయితే మరో రకంగా శాపంగా మారింది రాజ్ కుమార్‌కి.