Ramjan: ఈ ఏడాది పండగ ఎప్పుడొచ్చిందో తెలుసా.?

Ramjan

Ramjan: ఈ ఏడాది పండగ ఎప్పుడొచ్చిందో తెలుసా.?

Ramjan: ముస్లిం సోదరులు జరుపుకునే అతి పెద్ద పండగ రంజాన్.  ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ పండగను ఆనందంగా జరుపుకుంటారు. రంజాన్ పండగకు ముందు నెల రోజుల నుంచి ముస్లిం సోదరులు రంజాన్ మాసం జరుపుకుంటారు.

దాదాపు నెలరోజులపాటు ఉదయం  నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజూ అల్లాకి ప్రార్థనలు చేశారు. అందుకే.. ఈ మసాన్ని ముస్లిం సోదరులు Ramjan పవిత్ర మాసంగా భావిస్తారు.

అయితే ఎంతో నిమా నిష్టతో ఉపవాస దీక్షలో పాల్గొంటారు.ఇప్పుడు  నెల పాటు కఠిన ఉపవాసాలకు బ్రేక్ పడనుంది. దీంతో ముస్లీం సోదరులు ఇప్పుడు రంజాన్ పండగ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే Ramjan ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.చంద్రుని దర్శనాన్ని బట్టి రంజాన్ పండుగ ఏ రోజు అనేది ముస్లిం మత పెద్దలు నిర్థయిస్తారు. నెలవంకను బట్టి ఏప్రిల్ 22 లేదా 23న రంజాన్ పండుగను జరుపుకునే అవకాశముంది. ఇస్లాం ప్రకారం పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారంను అత్యంత పవిత్రమైనదిగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఆ రోజు రాతంత్రా జగారం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ఈ రోజు  ( శుక్రవారం ) నెలవంక కనిపిస్తే శనివారం రంజాన్ పండుగ ఉంటుందని లేకపోతే ముస్లింలు ఆదివారం పండుగను జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ ఖలీల్ అహ్మద్ చెప్పారు.

జుమ్మతుల్ విదాను పురస్కరించుకుని హైదరాబాద్ లోని అన్ని మసీదుల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేకంగా మక్కా మసీద్, పబ్లీక్ గార్డెన్స్ లోని రాయల్ మసీదులో జుమ్మతుల్ విదా ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆయా జోన్ లలో మసీదు పరిసరాలను శుభ్రం చేశారు. శనివారం లేదా ఆదివారం రంజాన్ పండుగ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఈద్గాలలో పండుగ రోజు నిర్వహించే సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ తెలిపారు.

అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఈద్గాల కమిటీలకు కూడా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ తెలిపారు. హైదరాబాద్ లోని మీరాలం, మాదన్నపేట్ ఈద్గాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించామన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని మైదానాల్లో కూడా Ramjan పండుగ నమాజ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించామని రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ మసీవుల్లా ఖాన్ వెల్లడించాడు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh