Janasena: పవన్ పోటీ చేసేది ఈసారి అక్కడి నుంచేనా..
Janasena: జనసేన వారాహి విజయ యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టింది. వారాహి విజయ యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
అలాగే గోదావరి జిల్లాల నుంచి వారాహి యాత్ర ప్రారంభించడమే కాకుండా ఈ జిల్లాల్లో వైసీపీకి 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా చేయాలనే పవన్ పిలుపు వెనుక ఉన్న ధీమా ఇప్పుడు జనసేన నేతలతో పాటు టీడీపీ,
బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. అలాగే పవన్ ధీమా వెనుక గల కారణాలపైనా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా గోదావరి జిల్లాలపై పవన్ ధీమా వెనుక ఉన్న ఓ సమీకరణంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. అదే 34-26-5.
అయితే 2019 ఎన్నికలలో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ రెండు స్థానాల లో ఓటమి చెందిన విషయం తెలిసిందే.. తక్కువ మెజారిటీతో అయినా ఆయన పై ప్రత్యర్ధులు గెలిచారు అయితే ఉబయ గోదావరి జిల్లాలలో
పశ్చిమగోదావరి తో పోలిస్తే జనసేన పట్ల అభిమానం తూర్పుగోదావరి జిల్లాలో కాస్త ఎక్కువ అని చెబుతారు..
జనసేన ప్లాన్ చేసే కార్యక్రమాలకువచ్చే స్పందన చూసినా ఆ విషయం నిజం అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
పవన్ పోటీ చేసేది ఈసారి అక్కడి నుంచేనా..
తమ జిల్లా నుంచి పోటీ చేసి ఉండు ఉంటే పవన్ ని గెలిపించుకొని ఉండే వాళ్ళమని జనసైనికులు కూడా సోషల్ మీడియా దగ్గర కామెంట్లు చేయడం తెలిసిందే.
దానికి తగ్గట్టే వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి గాని కాకినాడ నుంచి గాని ఆయన పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి.
పిఠాపురంలో అయితే ఇక్కడ ఇల్లు కూడా తీసుకొనే ఆలోచనలో ఉన్నాను అని పవన్ చెప్పడంతో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయటం ఖాయం అని అనిపించింది.
అయితే ముద్రగడ వ్యవహారం తర్వాత సమీకరణాలు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. పిఠాపురం నుంచి గాని కాకినాడ నుంచి గానిJanasena: పోటీ చేస్తే ముద్రగడ వర్గాన్ని ఉసిగోల్పి పరిస్థితిని పవన్ కు వ్యతిరేకంగా మార్చాలని
అదికార పార్టీ వ్యూహాలు పన్నినట్లుగా అనుమానిస్తున్న జనసేన తన ప్లాన్ బి ను అమలు లోకి తీసుకొచ్చిందని తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకుండా పశ్చిమగోదావరి లోని భీమవరం నుంచి గాని నరసాపురం నుంచి గాని
ఆయన పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్లుగా తెలుస్తుంది . కాపు సంక్షేమ సంస్థ అధ్యక్షుడు హరి రామ జోగయ్య కూడా ఆయనను పశ్చిమగోదావరి నుంచి పోటీ చేయాల్సిందిగా లేఖ రాశారు భీమవరం నుంచి పోటీ చేస్తే పోయిన చోట
వెతుక్కున్నట్లు ఉంటుందని లేదా నరసాపురం నుంచి పోటీ చేస్తే సొంత జిల్లా కాబట్టి విజయానికి తిరుగుండదు అంటూ ఆయన లేఖలో చెప్పుకొచ్చారు.
మారుతున్న సమీకరణాల నడుమ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్న జనసేనాని ఏ రకమైన
ఇబ్బందులు తలెత్తకుండా సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారని అందుకే వ్యతిరేకత తక్కువ ఉండే నియోజక వర్గాన్ని ఎంచుకోవాలని చూస్తునట్లుగా తెలుస్తుంది.
అలాగే 2014లో జనసేన మద్దతుతో టీడీపీ-బీజేపీ కలిపి ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో 34 సీట్లకు గానూ 26 సీట్లు గెల్చుకున్నాయి. వైసీపీ 5 సీట్లు గెల్చుకోగా.. బీజేపీకి రెండు సీట్లు దక్కాయి.
ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత మారిన 35 సీట్లను అప్పటి లెక్కల ప్రకారం చూస్తే వైసీపీ ఆరు సీట్లు, టీడీపీ 27 సీట్లు గెల్చుకున్నాయి. బీజేపీకి రెండు సీట్లు దక్కాయి.
అయితే ఈ సమీకరణాలన్నీ తిరగబడిJanasena: 2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి తూర్పు గోదావరిలో 19కి 14, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 15కు 13 సీట్లు గెల్చుకుంది.
అంటే ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ 27 సీట్లు గెల్చుకుంది. ఈ సమీకరణం తిరిగి టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే 2014 తరహాలోనే తమకు అనుకూలంగా మారుతుందని పవన్ ఆశిస్తున్నారు.