Jabardasth Rohini: కాలిలో రాడ్ ఉండిపోయి హాస్పిటల్ లో నటి

Jabardasth Rohini

Jabardasth Rohini: కాలిలో రాడ్ ఉండిపోయి హాస్పిటల్ లో నటి

Jabardasth Rohini: నటి రోహిణి సీరియల్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బిగ్ బాస్తో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

బిగ్ బాస్ అనంతరం టీవీ షోలు, సిరీస్ లు, సినిమాలు ఇలా వరుస అవకాశాలు వస్తున్నాయి రోహిణికి.

జబర్దస్త్ లాంటి షోలో కూడా మెప్పించి మొట్టమొదటి లేడీ టీమ్‌ లీడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కూడా బిజీగా మారిన రోహిణి. ఇప్పుడు ఆస్పత్రి పాలైంది.

ఆమె కాలికి సర్జరీ జరగడంతో లేవలేని స్థితిలో హాస్పిటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటుంది. తనకు సర్జరీ జరిగిన విషయాన్ని రౌడీ రోహిణీయే స్వయంగా యూట్యూబ్‌ ద్వారా వెల్లడించింది..

ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో హాస్పిటల్లో చేరింది రోహిణి.

Also Watch

Thailand Gambling Case: ఈడీ ముందుకు చికోటి ప్రవీణ్

దాదాపు ఐదేండ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్‌లో రోహిణి కాలిలో ఓ రాడ్‌ వేశారు. దాన్ని ఎప్పట్నుంచో తీసేయించాలని రోహిణి అనుకున్నప్పటికీ.. అప్పుడే కెరీర్‌లో బిజీగా మారడంతో కుదర్లేదు.

ఇన్నేళ్లకు కాస్త లీజర్‌ టైమ్‌ దొరకడంతో ఆస్పత్రికి వెళ్లి రాడ్‌ తీసేయించుకోవాలని భావించింది. అందుకే రీసెంట్‌గా ఆస్పత్రికి వెళ్లింది.

కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రోహిణి కాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు షాకిచ్చారు.

చాలా కాలం కావడంతో రాడ్‌ స్కిన్‌కు అతుక్కుపోయిందని.. ఒకవేళ ఫోర్స్‌ పెట్టి తీస్తే మల్టీపుల్‌ ఫ్రాక్చర్‌ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు.

దీంతో కాలిలో నుంచి రాడ్‌ తీయడం సాధ్యపడలేదు. కానీ ఆమె కాలికి మైనర్ సర్జరీ మాత్రం చేశారు. ఇదే విషయాన్ని రౌడీ రోహిణి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వెల్లడించింది.

ఈ వీడియోలో రోహిణి మాట్లాడుతూ.. 2016 లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయితే కొన్ని నెలలు బెడ్ మీదే ఉన్నాను. అప్పుడు అమ్మే అన్ని చూసుకుంది.

ఆ సమయంలో ఆపరేషన్ చేసి కాలు లోపల ఎముకకు సపోర్ట్ గా రాడ్ వేశారు. ఆ రాడ్ ఇన్నాళ్లు తీయించలేదు. కానీ ఇటీవల టీవీ షోలలో డ్యాన్స్ వేస్తుంటే కొంచెం నొప్పిగా ఉంటోంది.

దాని వల్ల సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోతున్నాను. అందుకే రాడ్ తీయిద్దామని హాస్పిటల్ కు వచ్చాను. డాక్టర్స్ కూడా రాడ్ తీయడానికి ఆపరేషన్ కు రెడీ చేశారు.

కానీ రాడ్ లోపల ఇరుక్కుపోయిందని, ఎంత ప్రయత్నించినా రాలేదని, ఒకవేళ బలంగా తీయాలని ప్రయత్నించినా ఎముక విరిగిపోతుందని చెప్పారు.

దానికంటే తీయకపోవడమే మంచిదని, ఆ రాడ్ అలాగే ఉంచేయమని డాక్టర్లు చెప్పారు అని తెలిపింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh