INTER: నేడే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు

INTER

నేడే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు

INTER: ఇంటర్మీడియట్‌ ఫలితాలను నేడు (ఏప్రిల్ 26) విడుదల చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి వెల్లడించనున్నట్లు బోర్డు తెలిపింది. INTER బోర్డు అధికారిక వెబ్‌సైట్లతోపాటు ఇతర మీడియా వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

ఫలితాలు ఇలా చూసుకోండి…

స్టెప్-1: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏప్రిల్ 26న సాయంత్రం 5.00 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు.

స్టెప్-2: ఇంటర్ ఫలితాలు విడుదల కాగానే అభ్యర్థులు https://bie.ap.gov.in/ లేదా https://examresults.ap.nic.in వెబ్‌సైట్లను సందర్శించాలి.

స్టెప్-3: తర్వాత ఆయా వెబ్‌సైట్‌లోని హోంపేజీలో ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

స్టెప్-4: ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్-5: లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ నమోదు చేయాలి.

స్టెప్-5: తర్వాత ‘SUBMIT’ బటన్‌ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.

స్టెప్-6: ఫలితాల కాపీని ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..

https://examresults.ap.nic.in

www.bie.ap.gov.in

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2022-2023 అకడమిక్ ఇయ‌ర్ గాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ పరీక్ష కేంద్రాల్లో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు నిర్వహించింది. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15న, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 3న ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్‌ 4న ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగిశాయి.

ఈ ఏడాది INTER పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజ‌రయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. వీరిలో 9,20,552 మంది రెగ్యులర్‌, 83,749 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh