Telangana half day schools: తెలంగాణ లో రేపటి నుంచే ఒంటిపూట బడులు
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఎంతో ఇష్టమైన ఒంటిపూట బడులను రేపటి (మార్చి 15) నుంచి నిర్వహించేందుకు నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. తెలంగాణలో వాతవరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు రాత్రి పూట చలి చంపేస్తుంటే పగలు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చి మెుదటి వారం నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఉక్కపోతతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్రత ఇబ్బందులు పడుతున్నారు. అందుకని తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రాధమిక, ప్రాధమికోన్నత, ప్రభుత్వ, ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్‌కు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు నిర్వహించాలని. ఆ తర్వాత విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే ఏప్రిల్ 3వ నంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పైన పేర్కొన్న ఆదేశాలను తప్పనిసరిగా అన్ని స్కూల్స్ పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించాలన్నారు.
ఇది కూడా చదవండి: