రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. ఏపీలో దాదాపు మూడున్నరేళ్ల పాటు గవర్నర్ గా కొనసాగిన విశ్వభూషణ్ హరిచందన్ కు ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలికారు. ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ దంపతులకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం రాజ్ భవన్ నుంచి ఎయిర్ పోర్టుకుచేరుకున్న గవర్నర్ దంపతులకు సీఎం జగన్, మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు.
కాగా నిన్న విజయవాడలో గవర్నర్ కు వీడ్కోలు పలికేందుకు భారీ సభను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. ఆ సభలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి గవర్నర్ సేవలపై మరియు ఆయనపై సిఎం జగన్ ప్రశంసల జల్లు కురిపించారు. గవర్నర్ కూడా తన స్పందనగా ఏపీ తనకు రెండో స్వస్ధలం అని, ఏపీని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని తెలిపారు. కాగా ఈ రోజు కూడా మరోసారి సీఎం జగన్ గవర్నర్ కు సీఎం జగన్ పాదాభివందనం చేసి గవర్నర్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఇది కూడా చదవండి:
- వీరోచితంగా, ధైర్యంగా పోరాడుతున్నా వారిని చూసి మేము గర్విస్తున్నాము – పుతిన్
- తల్లి కాబోతున్న ఇంగ్లాండ్ లేడీ క్రికెటర్ భార్య