Dwarampudi: పవన్ కళ్యాణ్‌కు దమ్ము ధైర్యం ఉంటే నా సవాలు స్వీకరించాలి
Dwarampudi: జనసేనాని పవన్ కల్యాణ్ పైన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్ అయ్యారు. అసలు కాకినాడ రూరల్ నియోజక వర్గంలో సర్పవరంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రసంగించిన గంటన్నరలో గంట తన గురించి మాట్లాడాడని ద్వారంపూడి చెప్పారు. పవన్ వంటి రాజకీయ వ్యభిచారి మాటలకు కౌంటర్ ఇస్తున్నట్లు చెప్పారు.
ముఖ‌్యమంత్రి కావాలనే పవన్ కళ్యాణ్ కోరిక సినిమాల్లో తప్ప బయట తీరదని, అంత కోరిక ఉంటే తానే ఓ సినిమా తీసుకోవాలని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్‌కు దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి ఓడించాలని సవాలు చేశారు.
అయితే తాను ఓడిపోతే పవన్ చేసిన ఆరోపణలన్నీ నిజమని ఒప్పుకుంటాననని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ము ధైర్యం ఉంటే తన సవాలు స్వీకరించాలన్నారు.
చంద్రబాబుతో ప్యాకేజీలు, సీట్ల ఒప్పందం కుదరకుంటే పవన్ రోడ్డు మీదకు వస్తాడు. ఎవడో చెప్పిన మాటలు విని కోతి లా గంతులేయకు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. తల్చుకుంటే కాకినాడలో పవన్ బ్యానర్‌లే ఉండేవి కావు.
అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎందుకు పెట్టాడు, రాజకీయపరంగా ఆయన జీ రోచంద్రబాబును ఉద్దరించడానికే పార్టీని నడిపిస్తున్నాడు. కాకినాడలో అన్ని సామాజిక వర్గాలు కలిసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాయి.
కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును, పవన్‌ను తరిమేస్తే అసలు కులాల గొడవే ఉండదు. కులాల గురించి మాట్లాడను అంటూనే కులాల మధ్య పవన్ చిచ్చు పెట్టేలా ప్రసంగిస్తున్నాడు. అయితే రానున్న 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కానున్నాయి.
అసలు పవన్ రోజుకో మాట చెబుతుంటారని,మార్చి 14న ఏమి చెప్పాడో పవన్‌కు గుర్తు లేదని ముఖ్యమంత్రి అయ్యే బలం తనకు లేదని చెప్పుకున్నాడని, జూన్ 14న కత్తిపూడిలో ముఖ్యమంత్రి చేయాలని మళ్లీ వేడుకున్నాడని, ఈ మధ్యలో చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లాడని, ప్యాకేజీ కోసం బాబు దగ్గరకు వెళ్లాడని, ఎమ్మెల్యేను చేయాలని, ముఖ‌్యమంత్రిని చేయాలని బతిమాలుకోవడం ఏమిటన్నారు.
కానీ తాను దొంగనోట్లు ముద్రిస్తున్నానని, అక్రమ వ్యాపారాలు చేస్తున్నానని ఆరోపణలు చేశాడని, తాను కనీసం మద్యం కూడా సేవించనని ఎవరో చెప్పింది విని తనపై ఆరోపణలు చేస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు Dwarampudi. బియ్యం వ్యాపారాలు చేసి రూ.15వేల కోట్ల సంపాదించానని ఆరోపించాడని, కాకినాడ నుంచి ఎగుమతులు పెరగడానికి డీప్ వాటర్ పోర్టు అందుబాటులోకి రావడమే కారణమన్నారు. మిగిలిన పోర్టుల కంటే హ్యాండ్లింగ్, వేర్ హౌస్ ఛార్జీలు తక్కువగా ఉండటం వల్ల చత్తీస్‌ఘడ్, బీహార్, ఒడిషా నుంచి కూడా బియ్యం వస్తున్నాయని, ఏపీ బియ్యం మాత్రమే కాకినాడ రావట్లేదన్నారు.
అయితే ఈరోజు నుంచి నీ పతనం ప్రారంభమైంది అని పవన్‌పై తీవ్రస్థాయిలో ద్వారంపూడి ధ్వజమెత్తారు. నన్ను ఓడిస్తానని పవన్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తానని ద్వారంపూడి తెలిపారు. ”నువ్వు జనసేన అధినేతవే అయితే నాపై పోటీ చేయు. నిన్ను తుక్కుతుక్కుగా ఓడించకపోతే నా పేరు చంద్రశేఖరే కాదు. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు ఓడిపోయానా అదే పని చేయాలి అని పవన్‌కు ప్రతిసవాల్ విసిరారు ఎమ్మెల్యే ద్వారంపూడి.