Gali Janardhan Reddy: వల్ల నష్టపోయిన బీజేపీ
Gali Janardhan Reddy: ఈ ఎన్నికల్లో అతి ఘోరంగా దెబ్బతిన్న పార్టీ గాలి జనార్ధన్ రెడ్డి స్థాపించిన కేఆర్ పీపీ . బళ్లారి సెగ్మెంట్ లోని మొత్తం 15 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ అభ్యర్థుల్లో కేవలం గాలి జనార్ధన్ రెడ్డి ఒక్కరే గంగావతి నుంచి గెలుపొందారు.అయితే సొంత పార్టీని పెట్టుకుని గంగావతి నుంచి పోటీకి దిగిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి 2 వేలకు పైగా ఓట్ల మోజారిటీతో విజయం సాధించారు.
అయితే ఆయన భార్య గాలి లక్ష్మి అరుణ మాత్రం బళ్లారి నుంచి ఓటమి పాలయ్యారు. బీజేపీను వీడి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అని ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు నలభై ఐదు స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపారు.
గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ వల్ల బీజేపీకి పెద్ద మొత్తంలో ఓట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.
దాదాపు 15 స్ధానాల్లో గాలి పార్టీ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్క గంగావతిలో తప్ప మిగతా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది.
మరోవైపు ఒకప్పటి గాలి అనుచరుడు బీజేపీ ముఖ్య నేత, మాజీ మంత్రి శ్రీరాములు ఈ సారి బళ్లారి రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మరోవైపు రామనగర నుంచి పోటీ చేసిన కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార గౌడ ఓటమి పాలయ్యారు.
కాగా సిద్దరామయ్యను సీఎం చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కానీ కర్ణాటక ఎన్నికల్లో అంచనాలకు మించిన ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీ కి మెజార్టీ రాదన్న ఫోల్ సర్వేలు తారుమారయ్యాయి.
కాంగ్రెస్ అధికార పీఠానికి అవసరమైన సీట్ల కంటే అధికంగా స్థానాలు సంపాదించడం విశేషం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని విధంగా ఏకంగా 136 స్థానాల్లో పాగా వేసింది.
గత ఎన్నికల్లో 104 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి అదనంగా మరో 32 స్థానాలను గెలుచుకుంది.
అయితే కేంద్రంలో ఉన్న మంత్రులందరూ గత 45 రోజులుగా తిష్టవేసి ఊరూ వాడ ప్రచారం చేసినా కనీసం గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా నిలుపుకోలేకపోయింది.
ప్రస్తుతం బీజేపీ 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. మరో విశేషం ఏమిటంటే బొమ్మై కేబినెట్ లోని 9మంది మంత్రులు ఓటమి పాలు కావడం.
అలాగే జేడీఎస్ అధినేత కుమారస్వామి ఆశలను ఓటర్లు గల్లంతు చేశారు. ఆ పార్టీకి గణనీయంగా పట్టున్న స్థానాల్లో సైతం అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
సాక్షాత్తూ కుమారస్వామే అతికష్టమ్మీద గెలుపు సాధించారు. అతని కుమారుడు నిఖిల్ కూడా చిత్తయ్యాడు.
గతంలో 37స్థానాల్లో ఘన విజయం సాధించి కింగ్ మేకర్ గా నిలిచిన కుమారస్వామి పార్టీ ఈ ఎన్నికల్లో ఓటర్లు 20 స్థానాలకే పరిమితం చేశారు.