Siddaramaiah : సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు

Siddaramaiah :

Siddaramaiah : సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు

Siddaramaiah :  కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో విషాదం నెలకొంది.

ఆయన సోదరి శివమ్మ భర్త రమే గౌడ(69) మరణించారు. శనివారం ఉదయం రమే గౌడ అనారోగ్యానికి గురికావడంతో వెంటనే అయన్ను చికిత్స కోసం మైసూరులోని ఆస్పత్రికి తరలించారు.Siddaramaiah :  చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడతో ఆయన ఈ ఉదయం 8.30 కు మృతి చెందారు.

రమే గౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రమే గౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం హత్తూరులో అంత్యక్రియలు జరగనున్నాయి.

మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హస్తం పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అప్పుడే కన్నడ సీఎం ఎవరనే చర్చ మొదలైంది.

ఈ క్రమంలో సిద్ధ రామయ్య కుమారుడు యతీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు. అలాగే ఒక అడుగు ముందుకేసి.

తన తండ్రి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశ కుమారుడిగా తనకు ఉందన్నారు.

గతంలో ఆయన అందించిన సుపరిపాలన ఖచ్చితంగా సీఎంగా కూర్చోబెడుతుందని ఆకాంక్షించారు.

బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిద్ధరామయ్య మళ్లీ పాలనను గాడి పెడతారని ప్రజల్లో నమ్మకం ఉందన్నారు.

సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా చూడాలని కన్నడ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగింది.

కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అలాగే  సిద్ధ రామయ్య వరుణ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నుంచి ఘన విజయం సాధించారు.

అలాగే షిగ్గావ్ నుంచి బసవరాజ్ బొమ్మై విజయం సాధించారు.. బళ్లారి రూరల్ నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఓడిపోయారు.

రామనగర నుంచి పోటీ చేసిన కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఓటమిపాలయ్యారు. గంగావతిలో గాలి జనార్థన్ రెడ్డి విజయం సాధించారు.

అయితే ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలకు మించి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh