హైకోర్టులో ఊరట లభించిన మాజీమంత్రినారాయణ
మాజీమంత్రి నారాయణ కు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై నారాయణపై 2020లో సీఐడీ కేసు నమోదు చేసింది. నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం ఆదేశించింది. 41ఏ నిబంధనలు అనుసరించాలని సీఐడీ పోలీసులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ నారాయణపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. 2019 నాటికి సీన్ మారింది వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చక . కక్షసాధింపే లక్ష్యంగా వైసీపీ పాలకులు పావులు కదపడం ప్రారంభించారు.అయితే ప్రతిపక్ష నాయకులపై రకరకాల కేసులు పెట్టి వేధింపులకు దిగారు.
అందులో భాగంగా అమరావతి రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించి నమోదు చేశారు. ఇదంతా ఆగమేఘాలపై జరిగిపోయింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు ను, ఏ2గా మంత్రి నారాయణను చేర్చారు. అప్పటి చంద్రబాబు, నారాయణ న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామంలో 2001 నవంబరు 2న పి.నారాయణ తన భార్య రమాదేవి పేరుతో 40 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. అప్పుడు మనది ఉమ్మడి రాష్ట్రం. ఆర్థిక సంస్కరణలు ముమ్మరంగా అమలవుతూ రాజకీయ నినాదాలు, ప్రత్యేక డిమాండ్‌లు అసలే వినిపించని టైమ్. తరవాత 2014లో రాష్ట్ర విభజన జరిగింది.
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి పరిపాలన మొదలుపెట్టింది. ఆ సమయంలో విజయవాడ చుట్టుపక్కల భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. విజయవాడకు దగ్గర ఉన్న పోరంకి వంటి గ్రామాల్లో నారాయణ వంటి వారి భూములు ఎకరం రూ.30 నుంచి 40 కోట్ల వరకు వెళ్లింది.రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీయే)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మున్సిపల్ శాఖ ఆధీనంలో పనిచేసేది. నారాయణ ఆ శాఖ మంత్రి రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డును (ఐఆర్‌ఆర్) నిర్మించాలన్న ప్రతిపాదనను సీఆర్డీయే తెరపైకి తెచ్చింది. గుంటూరు జిల్లాలో 17 గ్రామాలు, కృష్ణాజిల్లాలో 24 గ్రామాల మీదుగా ఐఆర్‌ఆర్ వెళ్లే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముసాయిదా ఐఆర్‌ఆర్‌ను 97.5 కి.మీ. పొడవు, 75 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారు. దీనికి 2017 ఫిబ్రవరి 8న సీఆర్డీయే సమావేశంలో ఆమోదం తెలిపారు. రైతులు, స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో వారి అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకుని 96.25 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రివైజ్డ్ ఐఆర్‌ఆర్‌ను ప్రతిపాదించారు. దీంతోపాటు ఐఆర్‌ఆర్ నుంచి రాజధానికి అనుసంధానించిన 27 రహదారులను 87.19 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలన్న ప్రతిపాదనను చేర్చారు. 2018 అక్టోబరు 31న గెజిట్‌ను వెలువరించారు.
ఇది కూడా చదవండి :