pass away :మాజీమంత్రి విజయరామారావు ఇక లేరు
మాజీమంత్రి విజయరామారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విజయరామారావు గారు సీబీఐలో పని చేసిన అనంతరం టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఖైరతాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణలోని ఏటూరునాగారంలో పుట్టిన విజయరామారావు 1959లో ట్రైనీ ఐపీఎస్‌గా విధుల్లో చేరారు. హైదరాబాద్ కమిషనర్‌గా, సీబీఐ డైరెక్టర్‌గా కీలకంగా వ్యవహరించారు. హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై బాంబు పేలుళ్ల కేసు, ఇస్రో గుదాచారం వంటి కేసులను దర్యాప్తు చేశారు. 2016లో విజయరామారావు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఆయన చాలాకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.
అసలు విజయరామారావు ప్రత్యక్షంగా రాజకీయాల్లో సృష్టించిన సంచలనాలు తక్కువే అయినా ఆయన కారణంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో విజయరామారావు ఖైరతాబాద్ నుంచి టీడీపీ తరపున విజయం సాధించారు. అప్పట్లో సీఎల్పీ నేతగా ఉన్నపి.జనార్థన్ రెడ్డి పై విజయం సాధించి సంచలనం సృష్టించారు విజయరామారావు గారు ఆయన చేతిలో ఓడిపోవడంతోకాంగ్రెస్‌లో పీజేఆర్ హవా తగ్గిపోయింది. సీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హవా పెరిగింది. 1999 నుంచి 2004 వరకు సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్ఆర్ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ గెలిచినా ఆ తరువాత ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హవాను తట్టుకుని కాంగ్రెస్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు.
ఇది కూడా చదవండి :