తల్లి కాబోతున్న ఇంగ్లాండ్ లేడీ క్రికెటర్ భార్య

england former cricketer sarah taylor announces pregnancy with partner diana

తల్లి కాబోతున్న ఇంగ్లాండ్ లేడీ క్రికెటర్ భార్య

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ సారా టైలర్ భాగస్వామి డయానా తల్లి కాబోతోంది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సారా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తల్లి కావాలనేది తన భాగస్వామి కల అని సారా తెలిపింది ఈ జర్నీ అంత తేలిక కాలేదన్న ఆమె డయానా ఎప్పుడూ ఆశను వదులుకోలేదంది. తను బెస్ట్ మామ్ అవుతుందన్న సారా అందులో తనకు భాగం ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. మరో 19 వారాల్లో తమ జీవితం విభిన్నంగా ఉంటుందంటూ. అలాగే  డయానా ఐదో నెల గర్భవతి అనే విషయాన్నితేలిపింది . డయానాతో కలిసి దిగిన ఫొటోతోపాటు సోనోగ్రఫీ సెషన్ ఫొటోలను సారా ట్వీట్ చేసింది. సారా-డయానా లెస్బియన్ జంట కావడంతో ఐవీఎఫ్ విధానంలో డయానా గర్భం దాల్చింది.

ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో సారా టేలర్‌ ఒకరు. 2006లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆమె 2019లో రిటైర్మెంట్ ప్రకటించింది. 2016లో మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆట నుంచి బ్రేక్ తీసుకున్న సారా తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ఇంగ్లాండ్‌ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇంగ్లాండ్‌ 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20ల్లో సారా ప్రాతినిధ్యం వహించింది. 126 వన్డేల్లో ఏడు సెంచరీలు చేసిన సారా 20 హాఫ్ సెంచరీలు చేసింది. 90 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 2177 పరుగులు చేసింది. మూడుసార్లు ఐసీసీ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 2014లో విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2017, 2009 వన్డే వరల్డ్ కప్‌‌తోపాటు 2009 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఆమె సభ్యురాలు.

రిటైర్మెంట్ ప్రకటించిన దగ్గర్నుంచి టేలర్ కుటుంబంపై ఫోకస్ చేస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఆమె డయానా ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయింది. సారా-డయానా దంపతులకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కంగ్రాచ్యులేషన్స్ లెజెండ్ అద్భుతమైన ప్రయాణం మీకోసం ఎదురు చేస్తోంది అని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ సారాకు అభినందనలు తెలిపారు. అయితే 2021లో అబుదాబీ టీ10 లీగ్‌లో టీమ్ అబుదాబీ కోచ్‌గా సారా టేలర్ నియమితురాలైంది. పురుషుల ప్రొఫెషన్ ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్‌గా నియమితురాలైన తొలి మహిళగా సారా రికార్డ్ క్రియేట్ చేసింది. తరువాత 2021లోనే ఇంగ్లాండ్ కౌంటీ సస్సెక్స్ తదుపరి సీజన్‌ కోసం తమ పురుషుల జట్టుకు సారాను కోచింగ్ స్టాఫ్‌గా నియమించింది.

ఇది కూడా చదవండి:

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh