Emergency landing: సౌదీ ఫ్లయిట్ కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Emergency landing

Emergency landing: సౌదీ ఫ్లయిట్ కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

 

Emergency landing: జెద్దా-హాంగ్ కాంగ్ కార్గో విమానం శనివారం కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కార్గో విమానం జెడ్డా నుంచి హాంకాంగ్‌కు వెళ్తున్నది. ఆ విమానం భారత గగనతలంపై ఎగురుతుండగా దాని విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది.అయితే ఇది  గమనించిన విమాన పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అనుమతి కోరారు.  ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించారు.Emergency landing

కాగా, సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కార్గో విమానం శనివారం మధ్యాహ్నం 12.02 గంటలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా దిగింది. ఆ కార్గో విమానంలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత ఎమర్జెన్సీ పరిస్థితిని వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇటీవలే బెంగళూరు నుంచి అబుదాబి వెళ్తున్న ఎటిహాద్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి కాసేపటికే తిరిగి బెంగళూరు విమానాశ్రాయానికి వచ్చింది. ల్యాండింగ్ అనంతరం ఫ్లైట్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విమానం తిరగి బయల్దేరి గమ్యస్థానాన్ని చేరుకుంది.

ఏప్రిల్ 1న ఢిల్లీ ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దుబాయ్‌కు చెందిన ఫెడ్ఎక్స్ విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh