జనసేనాని రాజకీయ లెక్క అదిరిందిగా మరి ..

determined to win tens of MLAs on behalf of Janasena

జనసేనాని రాజకీయ లెక్క అదిరిందిగా మరి ..

ఏపీ లో రానున్న ఎన్నికల్లో జనసేన  తరఫున పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించడంతోపాటు తాను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో జనసేనాని పవన్ కల్యాణ్  ఉన్నారు. ప్రస్తుతానికి భారతీయ జనతాపార్టీతో అధికారికంగా పొత్తు కొనసాగుతోంది కానీ ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదు అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీతో రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో బీజేపీతో జనసేన పొత్తును కొనసాగిస్తుందా? తెంపేస్తుందా? అనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో వాడి వేడి చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న  విషయం అందరికీ తెలిసిందే. దీంతోపాటు సమాంతరంగా వారాహితో యాత్రచేద్దామని గతంలోనే పవన్ నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను అంచనా వేసిన తర్వాత చివరి 6 నెలలే కీలకమని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారాహిని సిద్ధం చేశారు. అయితే అది ఇంకా రోడ్డెక్కలేదు. ఏపీ ప్రభుత్వం జీవో నెంబరు ఒకటిని అమలు చేస్తోంది.

మరోవైపు పవన్ కల్యాణ్ రెండు సినిమాలను ఒప్పుకున్నారు. సముద్రఖని దర్శకత్వంలో ఒక రీమేక్, హరిహర వీరమల్లులో మిగిలిన భాగం పూర్తిచేయడంతోపాటు మరో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాల ద్వారా వచ్చే పారితోషికాన్ని పవన్ కల్యాణ్ తన వారహి యాత్రతోపాటు ఎన్నికలకు ఖర్చుపెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో పవన్ కల్యాణ్ ఉన్నారు అని తెలుస్తుంది. యాత్రను ఎప్పుడు ప్రారంభిస్తారా? అని పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఇప్పటినుంచే ప్రభుత్వంపై పోరాటం చేస్తే స్పందించే విషయాలను పరిష్కరించి తనకు అనుకూలంగా వైసీపీ మార్చుకుంటుందని జనసేన అంచనా వేస్తోంది. యాత్ర ప్రారంభించినా ఎన్నికల వరకు ఆ వేడిని కొనసాగించలేమని భావిస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో ఎన్నికల సభ్యత్వాన్ని పూర్తిచేసి ఎన్నికలకు

ఖచ్చితంగా 6 లేక 8 నెలల ముందు రంగంలోకి దిగితే సరిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమా షెడ్యూళ్లు కూడా అలాగే ఉన్నాయి. వీటిని పూర్తిచేసి ఆ తర్వాత నుంచి ప్రజల్లో పూర్తిస్థాయిలో ఉండేలా పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh