CSK vs GT: కాసేపట్లో ప్రారంభం కానున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సీఎస్కే
CSK vs GT: వర్షం ఆటంకం కలిగించవడంతో ఆదివారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఈ
రోజు కి(మే 29) వాయిదా పడిన విషయం తెలిసిందే. మరో కొన్ని నిమిషాలలో మ్యాచ్ ఆరంభం కానుంది.
ప్రస్తుతానికైతే అహ్మదాబాద్‌లో వాతావరణం అనుకూలంగా ఉంది. ఎలాంటి వర్షం లేదు. ఆకాశం కూడా సాధారణంగానే ఉంది.
ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు, అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. కాసేపట్లో టాస్ పడనుంది.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మొదలైన వర్షం రాత్రి 11 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది.
అయితే ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఒక్కసారిగా మొదలైన వర్షం, మధ్యలో కాసేపు ఆగినా
మళ్లీ చినుకులు జోరందుకోవడంతో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన తుదిపోరును వాయిదా
వేయక తప్పలేదు. ఇరు జట్ల కోచ్‌లు ఆశిష్ నెహ్రా, స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత మ్యాచ్‌ను
అధికారులు పోస్ట్‌పోన్ చేయాలని నిర్ణయించారు. అంతకుముందే పిచ్, మైదానంలోని పరిస్థితిపై గ్రౌండ్స్‌మెన్‌తో అధికారులు సంప్రదింపులు జరిపారు.
ఫైనల్ మ్యాచ్ చూడటం కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారిని సోమవారం కూడా స్టేడియంలోకి అనుమతిస్తారు.
అయితే CSK vs GT:సోమవారం కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
సోమవారం కూడా వర్షం ఇలాగే కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు
. లీగ్ దశలో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే దీనికి కారణం.
సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, గంటకు 10-15 కిలోమీటర్ల వేగంతో
ఈదురు గాలులు వీస్తాయని వెదర్.కామ్ తెలిపింది. కానీ రాత్రి ఫైనల్ మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయంటూ గుడ్ న్యూస్ చెప్పింది.
చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు,
మొయిన్ CSK vs GT: అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్&వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీష పతిరాణా.
గుజరాత్ టైటాన్స్: శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్
పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ.