IPL 2023 :విజయానికి ఎంఎస్ ధోనీయే

IPL 2023

IPL 2023 :విజయానికి ఎంఎస్ ధోనీయే కారణం: మొయిన్ అలీ

IPL 2023 : చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2023 లో టైటిల్ విజయం ఒక అద్భుతమైన అనుభూతిగా అభివర్ణించాడు,

సోమవారం  జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చెన్నైసుపర్ కింగ్స్  రికార్డు స్థాయిలో 5 వ టైటిల్ ను సాధించిన

తరువాత ఆటగాళ్లు మరియు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఎంఎస్ ధోని నుండి నేర్చుకున్నానని చెప్పాడు.

‘అదొక అద్భుతమైన అనుభూతి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదేదో ఫైనల్  చివరికి మేమే చేశాం.

నేనెప్పుడూ ఎంఎస్ తోనే నేర్చుకునేవాడిని.  ఆటగాళ్లు, పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో. ఈ ఐపీఎల్ మ్యాచుల్లో

అతను ఎలా రాణిస్తాడో, ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకోవడం చాలా గొప్పగా ఉంటుంది’ అని మొయిన్ అలీ ఐపీఎల్

బ్రాడ్కాస్టర్లతో అన్నాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించిన

ధోనీ ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో ఐదో ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నాడు.   టాస్‌ ఓడి IPL 2023 : ముందుగా బ్యాటింగ్‌కు

దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు)

సెంచరీ కోల్పోగా… వృద్ధిమాన్‌ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) శుబ్‌మన్‌ గిల్‌ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

ధోనీయే కారణం: మొయిన్ అలీ

అనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (21 బంతుల్లో 32 నాటౌట్‌; 2 సిక్స్‌లు) రాణించారు.

సమష్టి బ్యాటింగ్‌ ప్రదర్శన… 42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81… తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్‌ భాగస్వామ్యాలివి.

జట్టులోని టాప్‌-4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సాహా, గిల్‌ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ

ఈ సీజన్‌లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్‌ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్‌ ఇచ్చిన సునాయాస

క్యాచ్‌ను దీపక్‌ చహర్‌ వదిలేసి గుజరాత్‌కు మేలు చేశాడు. చహర్‌ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా..

. తుషార్, తీక్షణ ఓవర్లలో గిల్‌ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు.

వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు.

ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్, కాన్వే 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్కోరును 52 పరుగులకు చేర్చారు.

అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలమయ్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుదిరిగారు.

అయితే రుతురాజ్‌ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు),

అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు.

అయితే గుజరాత్ టైటాన్స్ జోరు కానీ, రెండు రోజుల ప్రతికూల వాతావరణం కానీ ధోనీ సేన అత్యధిక ఐపీఎల్

ట్రోఫీ విజయాల IPL 2023 :పరంగా తమ ప్రత్యర్థి ను కట్టడి చేయకుండా అడ్డుకోలేకపోయింది. ఫైనల్ తో సహా మొత్తం

ఐపీఎల్ లో ధోనీ మానియా ఆధిపత్యం చెలాయించిన నేపథ్యంలో వచ్చే ఏడాది ధోనీ తిరిగి సీఎస్ కేకు సారథ్యం వహిస్తాడో లేదో చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh