Contract Employees : కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
Contract Employees : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది .తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ), పింఛనుదారులకు కరవు భృతి(డీఆర్) 2.73 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. డీఏ పెంపు 2022 జనవరి నుంచి వర్తిస్తుంది.
ప్రభుత్వ నిర్ణయంతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వంపై నెలకు రూ. 81.18 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 974.16 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
పెంచిన డీఏ ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులకు 2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు రూ. 1380.09 కోట్ల బకాయిలను చెల్లించనున్నారు. పెరిగిన డీఏ జూన్ నెల వేతనం, పింఛనుతో కలిపి Contract Employees : ఇవ్వనున్నట్లుగా మంత్రి హరీష్ రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది.
ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉచిత విద్యతో పాటు ఇంగ్లీషు బోధనపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకు రావాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించిన సంగతి తెలిసిందే .
ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చించి పూర్తి విధి విధానాలపై సమగ్ర నివేదికను రూపొందించనున్నారు.