CM YS Jagan: టెన్త్‌ టాపర్లకు ఏపీ సీఎం గుడ్‌న్యూస్‌..

CM YS Jagan

CM YS Jagan: టెన్త్‌ టాపర్లకు ఏపీ సీఎం గుడ్‌న్యూస్‌..

CM YS Jagan: ఏపీ లో  పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టెన్త్ టాపర్లుగా నిలిచిన విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గతంలో రాష్ట్ర స్థాయిలోనే ఈ అవార్డులు వుండగా.. వీటిని జిల్లా, నియోజకవర్గ స్థాయికి కూడా విస్తరించాలని సీఎం ఆదేశించారు.

నియెజకవర్గ స్థాయిలో ఫస్ట్ ర్యాంకర్‌కి రూ.15 వేలు.. సెకండ్ ర్యాంకర్‌కి రూ.10 వేలు.. థర్డ్ ర్యాంకర్‌కి రూ.5 వేలు చొప్పున ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Also Watch

IPL 2023 CSK:చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు భారీ షాక్

గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. మరోసారి కూడా బాలికలే పైచేయి సాధించారు..

బాలికల్లో ఉత్తీర్ణత 75.38 శాతంగా ఉండగా.. బాలురుల్లో ఉత్తీర్ణత 69.27 శాతంగా ఉంది..

రాష్ట్రంలోని 933 స్కూళ్ళల్లో వంద శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు.. అయితే, 38 స్కూళ్ళల్లో సున్నా శాతం ఫలితాలు నమోదు అయ్యాయి..

ఈ ఏడాది ఫలితాల్లో టాప్ లో పార్వతీపురం మన్యం జిల్లా 85 శాతం ఉత్తీర్ణతతో ఉండగా.. లాస్ట్‌లో నంద్యాల జిల్లా 60.39 శాతంతో ఉంది.. ఇక, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 95.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇక, ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఎగ్జామ్స్‌కి..

6.64 లక్షల మంది విద్యార్ధులు హాజరైన విషయం విదితమే.

ఇకపోతే… బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్ధులు చదువుకుంటారని అన్నారు.

వారిని తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో నిలబడేలా చేస్తున్నామని .. మంచి మార్కులు సాధించిన విద్యార్ధులకు మరింత ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించామని బొత్స తెలిపారు.

దీనిలో భాగంగా ఈ నెల 23న నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి అవార్డులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ నెల 27న జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు అవార్డులు అందిస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh