CM Jagan:నేడు అమరావతిలో 50 వేల
CM Jagan: రాజధానిప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్దమైంది.
సీఆర్డీఏ పరిధిలో50,793 మందికి ఒక సెంట్ చొప్పున పంపిణీ చేయనుంది.
మంది మహిళలకు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
దీంతో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ. 443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందచేస్తారు.
సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం,
పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.
ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీల్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని
ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం 25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది.
ఈ భూముల్లో ఎన్టీఆర్ జిల్లాకు 751.93 ఎకరాలు కేటాయించారు. అందులో 14 లే అవుట్లు వేసి
27వేల 532 మందికి ప్లాట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,860 మందికి 650.65
ఎకరాలు కేటాయించి 11 లేఅవుట్లు వేశారు. అన్నింటికీ హద్దు రాళ్లు వేసి పొజిషన్ ఇచ్చారు.
వీటి కోసం రోడ్లు కూడా నిర్మించారు.
ఈ భూముల పంపిణీ అంశంపై పెద్ద దుమారమే రేగింది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలోఅమరావతి
రైతులు రాజధాని నిర్మాణం కోసం ఈ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు.అయితే వైసీపీ ప్రభుత్వం
వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దాంతో అమరావతిలో రాజధాని నిర్మాణం
ఆగిపోయింది. అయితే అమరావతిలో శాసన రాజధానిని CM Jagan: నిర్మిస్తున్నామంటున్న ప్రభుత్వం
.. అందుకు.. వేల ఎకరాల భూములు అవసరం లేదని చెబుతోంది. అందువల్ల ఆ భూములను పేదలకు
పంచడం సరైన నిర్ణయంగా భావించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, అమరావతి రైతులు వ్యతిరేకించారు.
కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఐతే కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది.
అందువల్ల ప్రభుత్వం ఇవాళ భూముల పంపిణీకి సిద్ధమైంది.
వెంకటపాలెంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 జిల్లాల
యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. లక్ష మందిని సభకు తరలించాలని అధికారులను
ఆదేశించారు. సభా ప్రాంగణానికి సరైన రహదారులు లేకపోవటం. అందులోనూ వేసవి కావడంతో
జన సమీకరణ కోసం అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రహదారులకు హడావుడిగా
మరమ్మతులు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరినీ ఆహ్వానించారు.
వారి కుటుంబసభ్యులు, బంధువులు కూడా రావాలని చెప్పారు.
ప్రజల్ని తరలించేందుకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్దఎత్తున ఆర్టీసీ
బస్సులను కేటాయించారు. విద్యాసంస్థల నుంచి మరో CM Jagan:
12వందల బస్సులు సమీకరించారు. ఉదయం 7 గంటల కల్లా బస్సులు బయలుదేరాలని
ఆదేశించారు. 3వేల మంది పోలీసులను బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కోసం కేటాయించారు.