Umapathi Rao:రిటైర్డ్ ఐఏఎస్ఉమాపతి రావు మృతి

Umapathi Rao:

Umapathi Rao:రిటైర్డ్ ఐఏఎస్ఉమాపతి రావు మృతి

Umapathi Rao: విశ్రాంత ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు (92) కన్నుమూశారు.

గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 3 లోని నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు.

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెరవలి గ్రామానికి చెందిన ఆయన 1928  జులై 27న జన్మించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) పట్టా తీసుకున్నారు.

1977లో సివిల్స్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు.. గురువారం దోమకొండలో ఉమాపతి రావు అంత్యక్రియలు

జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. దోమకొండ కోట వంశీయుడు, రిటైర్డ్ ఐఏఎస్

అధికారి అయిన ఉమాపతి రావు పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు.

ఈయన గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలి ఈవోగానూ పని చేశారు.

దోమకొండ సంస్థానాన్ని ఉమాపతి రావు పూర్వీకులు 400 ఏళ్ల పాటు పాలించారు.

ఉమాపతి రావుకు అనిల్ కుమార్ ఒక్కడే కుమారుడు ఉన్నారు.

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఉమాపతిరావుకి

మనవరాలు ఉమాపతి రావు నీతి నిజాయతీతో గొప్ప వ్యక్తిగా జీవించారని

మనుమరాలు ఉపాసన పేర్కొన్నారు. ఉమాపతి రావు ఉర్దూ భాషలోనూ

కవితలు Umapathi Rao:  రాసేవారని ఆమె తెలిపారు. గొప్ప విలువలతో కూడిన తన తాతయ్య

చనిపోవడం పట్ల ఉపాసన ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించి  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి, విజయనగరం జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు.

సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌,  సాధారణ పరిపాలన శాఖ

(జీఏడీ- పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఏపీఐఐసీ ఎండీగా

2003లో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం భూకబ్జా నిరోధక కోర్టు పరిపాలన సభ్యునిగా పనిచేశారు.

విశ్రాంత ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతి రావు మరణం పట్ల ముఖ్యమంత్రి

కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, సాంఘిక సంక్షేమశాఖలకు Umapathi Rao:  ఆయన

విశేషంగా సేవలందించారని కొనియాడారు. ఉమాపతిరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh