పెండింగ్ బిల్లుల పైకీలక నిర్ణయం గవర్నర్ తమిళి సై

TS GOVERNOR TAMIL సై :పెండింగ్ బిల్లుల పైకీలక నిర్ణయం గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళి సై పెండింగ్ బిల్లుల పైకీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం గవర్నర్ కు పంపించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టిన బిల్లులపై కీలక నిర్ణయం తీసుకున్న తమిళిసై మూడు బిల్లులను ఆమోదించి మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపించారు. మరో రెండు బిల్లులను పెండింగ్ లో పెట్టారు. కాగా ఏడు బిల్లులను బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకు పంపించారు. కానీ గవర్నర్ వాటిని ఆమోదించకుండా ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉంచారు. ఈక్రమంలో ఈ బిల్లుల ఆమోదంపై కీలక నిర్ణయం తీసుకున్న గవర్నర్ మూడు బిల్లులకు ఆమోదం పలికి రెండు బిల్లులను పరిశీలన కోసం ప్రభుత్వానికి తిప్పి పంపించారు. మరో రెండు బిల్లులను పెండింగ్ లో ఉంచారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ తమిళి సై.

అయితే ఇంకా  ఏడు బిల్లులును గవర్నర్ ఉద్ధేశ పూర్వకంగానే   ప్రభుత్వం పంపించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారని వాటిని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతు బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇటీవల బడ్జెట్ సమవేశాలకు ముందు బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది. చివరికి తానే వెనక్కి తగ్గింది బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపడంతో సమస్య పరిష్కారమయిందనుకున్నారు. గవర్నర్ ప్రసంగంలోనూ ఎలాంటి వివాదం ఏర్పడకపోవడంతో ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు. కానీ గవర్నర్ తమిళిసైకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది.

అయితే ఈ నేపద్యంలో  గవర్నర్ తమిళిసై మూడు బిల్లులకు ఆమోదం పలికి రెండు బిల్లులను వెనక్కి పంపించి మరో రెండు బిల్లులను పెండింగ్ లో పెట్టటంతో ఏ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించింది. ఏ బిల్లలను తిప్పి పంపారనే వివరాలు తెలియాల్సి ఉంది. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోెజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు ముందు గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh