రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపై అలాగే ఆ సినిమా లో రామ్ చరణ్ పాత్రకు దేశమంత ఫిదా అయ్యారు. కాగా ఇప్పుడు జిమ్ కమరోన్ వంతు అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాపై రామ్ చరణ్ పై కమరోన్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆ కమరోన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన చిరంజీవి తన ఆనందానికి అవదులు లేనట్లు తెలిపారు. ఒక తండ్రిగా ఇంతకంటే ఏమి కావాలి అని ఆయనా తన బావోద్వేగాలిని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. “అయ్యా @JimCameron మీలాంటి గ్లోబల్ ఐకాన్ అండ్ సినిమాటిక్ జీనియస్ నుంచి #RRR ఆయన పాత్రకు లభించిన గుర్తింపు ఆస్కార్ కంటే తక్కువేమీ కాదు! ఇది గొప్ప గౌరవం. @AlwaysRamCharan ఒక తండ్రిగా ఆయన ఎంత దూరం వచ్చారో గర్వంగా ఫీలవుతున్నాను. మీ అభినందన అతని భవిష్యత్తు ప్రయత్నాలకు ఒక ఆశీర్వాదం” అంటూ కామేరోన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ని పోస్ట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పానవసారం లేదు ఆర్ఆర్ఆర్ మానియా అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ నామినేషన్‌ల వరకు వెళ్లడం, నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం కూడా మనం చూసాము. ఆస్కార్ కూడా అడుగు దూరంలో ఉంది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన టైంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పేరు మార్మోగిపోయింది. రామ్ చరణ్ నటనను చూసి అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి వారు రాజమౌళిని పొగడటం, ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుతంగా ఉందంటూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: