చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్….

chicken rates decrease

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్….

దేశంలో ధరలు పెరుగుతున్నాయి అంటే జనాలు చూసేదీ నిత్యావసరాల సరుకుల వైపు కాదూ. బంగారం, డీజిల్, పెట్రోల్ ధరల వైపే ఆ తర్వాత చూసేదీ చికెన్ ధరలనే. ఎందుకంటే మన దేశంలో మాంసాహార ప్రియులు ఇష్టంగా తినేదీ చికెన్నే. నాన్ వెజ్ కేటగిరిలో ఇది లేందే ముద్ద దిగదు. చికెన్ ప్రియులైతే దీంతో ఏ వంటకం చేసినా లొట్టలేసుకుని లాంగించేస్తారు. అందుకే చికెన్ ధరలు పెరుగుతున్నాయంటే అయ్యే తూకంలో లేదా కంచంలో ఓ ముక్క తగ్గిపోతుందే అని భావిస్తుంటారు ఇప్పుడు చికెన్‌ ధరలు భారీగా పతనమయ్యాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు రూ.220 నుంచి రూ.160కు చేరాయి. అయితే కిలోకు దాదాపు దాదాపు రూ.60 తగ్గింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్‌ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్రాయిలర్‌ కోడి లైవ్‌ ధర రూ.90కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండడం , చికెన్ ధరలు తగ్గడం తో చాలామంది హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు చికెన్ ప్రియులు అలాగే కోడిగుడ్డుదీ అదే దారి కోడిగుడ్డు ధరలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. రిటైల్‌లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు. గిట్టుబాటు కావడం లేదు
కోళ్ల రైతులకు ప్రస్తుత ధరలు గిట్టుబాటు కావటం లేదు. పిల్ల రేటు, ఫీడ్‌ రేటు పెరిగిపోయింది. మరో పక్క ట్రాన్స్‌పోర్టు చార్జీలు, లేబర్‌ చార్జీలు పెరిగిపోయాయి. చికెన్‌ ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వం చికెన్‌ వ్యాపారులను ఆదుకోవాలి.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh