RRR vs చెల్లో… చెల్లో ముందు ‘RRR’ ఎందుకు వెనుకబడింది?
ఇటీవలి కాలంలో rrr సినిమా ఆస్కార్ కు నామినేట్ అవుతాది… ntr ను ఆస్కార్ వరించనుంది అనే ప్రచారం జోరుగానే సాగింది కానీ అనూహ్యంగా మన అంచనాలు తలకిందులు చేస్తూ ఒక గుజరాతీ సినిమా చెల్లో అనే మూవీ ఆస్కార్ కు నామినేట్ అయింది అనే వార్త … అందరికీ ఒకింత ఆశ్చర్యాన్ని… rrr ఫ్యాన్స్ కి నిరాశని కలిగించాయి… అసలు ఈ చెల్లో మూవీ లో ఏముంది? దీని ముందు rrr సినిమా ఎలా వెనుకబడింది?? ఇవాళ్టి బిగ్ analysis లో చూద్దాం ….
దర్శకుడు పాన్ నలిన్ సినిమా ‘ఛెల్లో షో’ భారత్ నుంచి ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఇది గుజరాతీ చిత్రం. 95వ ఎడిషన్ ఆస్కార్ అవార్డుల కోసం అధికారికంగా భారత్ నుంచి ఈ సినిమాను నామినేట్ చేశారు.
‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయింది.భారత సినిమా సమాఖ్య కార్యదర్శి సుపర్ణా సేన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ కన్నడ దర్శకుడు టీఎస్ నాగాభరణ నేతృత్వంలోని జ్యూరీ, ఆస్కార్ నామినేషన్ కోసం ‘ఛెల్లో షో’ చిత్రాన్ని ఎంపిక చేసింది.న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఛెల్లో షో’ వరల్డ్ ప్రీమియర్ షోను ప్రదర్శించారు.
భారత్‌లో ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుంది.తన సినిమాను అధికారికంగా ఆస్కార్ అవార్డు కోసం పంపడంతో పాన్ నలిన్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఈ చెల్లో సినిమా కథాంశం ఏంటి? ఇంత ప్రజాదరణ పొందిన rrr ఈ సినిమా ముందు ఎందుకు వెనకబడింది??
ఛెల్లో’ అనేది గుజరాతీ పదం. దీనికి ‘చివరిది’ అని అర్థం. ఛెల్లో షో అంటే ‘చివరి షో’.
ఇది ‘సమయ్’ అనే 9 ఏళ్ల బాలుడి కథ. ‘సినిమా’ అనే మాయా ప్రపంచం వైపు సమయ్ ఆకర్షితుడు అవుతాడు. సౌరాష్ట్రలోని చలాలా గ్రామంలో అల్లిన ఈ కథలో సమయ్… తన తండ్రికి టీ కొట్టు నిర్వహణలో సహాయపడుతుంటాడు.
ఈ టీ కొట్టు, ఒక రైల్వే స్టేషన్‌లో ఉంటుంది. ఈ స్టేషన్‌లో కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. దీంతో అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది.సమయ్‌కి చదువుపై ఆసక్తి ఉండదు. ఒకసారి తన కుటుంబంతో కలిసి సినిమా చూడటానికి వెళ్తాడు సమయ్ .
అప్పుడే అతనికి సినిమాలపై, థియేటర్లపై ఇష్టం పెరుగుతుంది.థియేటర్‌లో ప్రొజెక్టర్ నడిపే ఫైజల్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. సమయ్ తల్లి రుచిగా వంట చేస్తారు. తన కోసం తల్లి ఇచ్చే భోజనాన్ని ఫైజల్‌కు ఇస్తూ, దానికి బదులుగా ప్రొజెక్టర్ రూమ్ నుంచి సినిమా చూస్తానంటూ ఫైజల్‌తో సమయ్ ఒప్పందం చేసుకుంటాడు.
ఈ ప్రొజెక్టర్ రూమ్, సమయ్‌కి తొలి సినిమా స్కూల్‌గా మారుతుంది.సమయ్ తండ్రి … తన కొడుకు బాగా చదువుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని, తన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలని ఆశిస్తారు.
కానీ సమయ్, 9 ఏళ్ల వయస్సులోనే స్కూల్‌కు వెళ్లడం మానేసి ప్రొజెక్టర్ రూమ్‌లో సినిమాలు చూడటం మొదలుపెడతాడు. సినిమాపై తనకున్న విపరీతమైన ప్రేమ, అభిమానంతో పనికిరాని వస్తువుల నుంచి ఒక ప్రొజెక్టర్‌ను తయారు చేస్తాడు.సినిమా ప్రపంచం మారుతోన్న తీరును ఈ చిత్రం ద్వారా చూపించారు.
సంప్రదాయ రీళ్ల నుంచి డిజిటల్ వరకు, సింగిల్ తెర థియేటర్ల నుంచి మల్టీప్లెక్స్ సినిమా హాళ్ల వరకు భారత సినిమా ఎలా ఎదిగిందో ఇందులో చూపించారు.సినిమా డైరెక్టర్ నలిన్ ప్రకారం, ఈ సినిమా ఒక ‘సెమీ-ఆటోబయోగ్రఫికల్’ చిత్రం. అంటే ఈ చిత్రాన్ని కొంతవరకు తన జీవిత కథ ఆధారంగా తీశారు.
‘ఛెల్లో షో’ సినిమాను 1998 నాటి ఇటాలియన్ చిత్రం ‘సినిమా పరాడిసో’తో పోల్చారు. ఆ సినిమాలో కూడా 8 ఏళ్ల సెల్వాటోర్, ‘సినిమా పరాడిసో’ అనే పేరుతో ఉన్న థియేటర్‌లోనే తన సమయాన్నంతా గడుపుతాడు.
ఆల్ఫ్రెడ్ అనే ప్రొజెక్టర్ ఆపరేటర్‌ను సెల్వాటోర్ కలుస్తాడు. ఆపరేటర్ బూత్ నుంచి సెల్వాటోర్ సినిమాలు చూసేందుకు ఆల్ఫ్రెడ్ అనుమతిస్తాడు. దీనికి బదులుగా రీళ్లు మార్చడం, ప్రొజెక్టర్‌ను తిప్పడం వంటి పనుల్లో ఆల్ఫ్రెడ్‌కు సెల్వాటోర్ సహాయం చేస్తుంటాడు.ఇది ఈ సినిమా కథాంశం…
rrr సినిమా దర్శకుడు రాజమళి .. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు… ఇప్పటివరకు హిట్ అనే మాటే గానీ ఫ్లాప్ అనేది చవిచూడని తిరుగులేని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు…
rrr సినిమా సినిమాతో world wide గా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు… మరి ఆస్కార్ కు నామినేట్ అయిన చెల్లో సినిమా దర్శకుడు పాన్ నలిన్ background ఏంటి? ఆయన క్రేజ్ ఏంటి అని చూస్తే…
పాన్ నలిన్‌కు….
పేరులోనే పాన్ ఉంది గానీ ఆయన పాన్ ఇండియా దర్శకుడు కాదు .ఆయనకు ‘అవార్డ్ విన్నింగ్’ సినిమాల దర్శకుడు అనే పేరు ఉంది. ఆయన సంసార, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెస్, ఆయుర్వేద: ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అనే సినిమాలను తీశారు.
సినిమా తీయడంలో పాన్ నలిన్ ఎలాంటి శిక్షణ పొందలేదు. ఆయన స్వయంగా ఈ కళను నేర్చుకున్నారు. అహ్మదాబాద్‌లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఆయన చదివారు…. చెల్లో సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా…
మీరు మీ కలల కోసం కష్టపడితే, విజయం మిమ్మల్ని వరిస్తుంది’ అనే సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. దీని కథనం కూడా చాలా సాధారణంగా సాగుతుంది”.ఈ సినిమాను తీయడానికి మూడున్నరేళ్లు పట్టిందట.ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన రాజమౌళి సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ను భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ కోసం ఎందుకు నామినేట్ చేయలేదని చాలామంది సినిమా సమీక్షకులు, జర్నలిస్టులు, సినీ అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గణనీయమైన వసూళ్లు రాబట్టింది. ఆశ్చర్యపరిచే వీఎఫ్ఎక్స్, భారీ ఫైటింగ్ సీన్లు, అద్భుతమైన విజువల్స్ కారణంగా ఈ సినిమాకు అంతటా మంచి ఆదరణ దక్కించుకుంది .
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది చాలా విచిత్రమైన సంస్థ. 2013లో చాలామంది విదేశీ విమర్శకులు కూడా భారత్ నుంచి ‘లంచ్ బాక్స్’ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేయాలని తమ అభిప్రాయాన్ని చెప్పారు.
కానీ, అప్పుడు ‘లంచ్ బాక్స్’ సినిమాను ఆస్కార్ కోసం నామినేట్ చేయలేదు. అలాగే విదేశాల్లో బాగా ఆదరణ పొందిన ‘ది డిసైపుల్’ అనే సినిమాను కూడా విస్మరించారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు’.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది చాలా విచిత్రమైన సంస్థ.
2013లో చాలామంది విదేశీ విమర్శకులు కూడా భారత్ నుంచి ‘లంచ్ బాక్స్’ సినిమాను ఆస్కార్‌కు నామినేట్ చేయాలని తమ అభిప్రాయాన్ని చెప్పారు. కానీ, అప్పుడు ‘లంచ్ బాక్స్’ సినిమాను ఆస్కార్ కోసం నామినేట్ చేయలేదు.
అలాగే విదేశాల్లో బాగా ఆదరణ పొందిన ‘ది డిసైపుల్’ అనే సినిమాను కూడా విస్మరించారు. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు’.2015లో బాహుబలి, బజ్‌రంగీ భాయ్‌జాన్ సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. 2016లో దంగల్‌కు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు 2022లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు కూడా ఇలాగే జరుగుతోంది. ఈ సినిమాలన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.. కానీ ఆస్కార్ కి నామినేట్ కాలేదు..