CBSE Result : 2023 CBSE క్లాస్ 12 ఫలితాలు విడుదల
CBSE Result :సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలు విడుదలయ్యాయి. క్లాస్ 12 బోర్డు పరీక్షల ఫలితాలను శుక్రవారం ప్రకటించింది సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్). మొత్తం మీద 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేసింది. కొవిడ్ ముందు దశ (2019- 83.40శాతం)తో పోల్చుకుంటే..
ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించింది. అభ్యర్థులు తమ ఫలితాలను results.cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.
డిజీలాకర్, ఉమంగ్ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్‌ను పొందవచ్చు.
ఈ ఏడాది 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు.
గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలకు మొత్తం 16.60 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కోవిడ్ మహమ్మారి జోరుగా ఉన్న సమయంలో 2019లో 83.40% ఉత్తీర్ణత శాతం కంటే ఈ సారి 87.33% ఎక్కువ ఉత్తీర్ణత నమోదైంది.
అయితే గతేడాది 92.71% కంటే తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే కాంపిటీషన్ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఈసారి కీలక చర్యలు చేపట్టింది సీబీఎస్ఈ. ఇందులో భాగంగా.. ఫస్డ్, సెకెండ్CBSE Result : , థర్డ్ డివిజన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. అయితే.. టాపర్స్‌కు మెరిట్ సర్టిఫికేట్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది.
కేరళలోని తిరువనంతపురంలో అత్యధికంగా 99.91శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కనిష్ఠంగా 78.05శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంకా సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15- మార్చ్ 21 మధ్యలో ఈ పరీక్షలు జరిగాయి. ఇక క్లాస్ 12 పరీక్షలను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించింది సీబీఎస్ఈ. జనవరి 2 నుంచి 14 మధ్యలో ఈ రెండు క్లాస్‌లకు ప్రాక్టికల్ పరీక్షలు సైతం జరిగాయి.