Bonalu Festival : ఆషాఢ బోనాలకు ముందే దేవాలయాలకు ఆర్థిక సహాయం : మంత్రి తలసాని

Bonalu Festival

Bonalu Festival : ఆషాఢ బోనాలకు ముందే దేవాలయాలకు ఆర్థిక సహాయం : మంత్రి తలసాని

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 15 కోట్లు కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు. బోనాల ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా దేవాదాయ శాఖ పరిధిలోని లేని దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

అయితే Bonalu Festival : ముందే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రకటించారని తెలిపారు.

కాగా.. ప్రతి సంవత్సరం గోల్కొండలో బోనాల ఉత్సవాలు ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభంకానున్నాయి. ఆ తరువాత జూలై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు, 16న పాతబస్తీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపులు జరుగనున్నాయి. బోనాలు పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబుకానున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh