BJP : నేడు ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం

BJP

BJP : నేడు ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం

BJP : కర్ణాటక  ఎన్నిక ల తర్వత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉత్సహం మొదలు అవ్వడంతో పలువురు నేతలు కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారు.

అప్పటించి బీజేపీ నాయుకులు నిరాశ చెందగా దీంతో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి  నాయకులు పలు కార్యక్రమాలు చేయడానికి సిద్దపడ్డారు.

అయితే దినిలో  భాగంగా అలాగే మోడీ  తొమ్మిదేళ్ల పాలన పూర్తి అయ్యిన సందర్భంగా నేడు ఇంటింటి బీజేపీ కార్యక్రమ౦ చేపట్టారు.

అలాగే  ఈ ఒక్క రోజే 35 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరూ కనీసం వంద కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించింది.

రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లి నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు కరపత్రాలను పంపిణి చేయనున్నారు.

అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటించనున్నారు.

ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలు, ప్రజలకు జరిగిన మేలును వివరించనున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లనున్నారు.

కానీ  ఈ కార్యక్రమానికి బీజేపీ  సీనియర్ నాయకులు  దూరంగా ఉండడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది.

BJP  సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

దీనిమీద తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఈ నెల 30వ తేదీవరకు సమయం ఉంది.  అయితే ఎవరికి  టైమ్ కుదిరినప్పుడు వారు పాల్గొంటారని అన్నారు.

కొందరు నేతలు ఫోన్ చేసి కుదరడం లేదని చెప్పారని. ఈ రోజు కాకపోతే రేపు జాయిన్ అవుతారని అన్నారు.

ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం వస్తుందని నాయకత్వం భావిస్తోంది.

కానీ తెలంగాణ BJP లో ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈటల సైలెంట్‌ అయినట్టు సమాచారం.

మరోవైపు.. కాంగ్రెస్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్టివ్‌ కావడంతో ఆయన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి సైలెంట్‌ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక, ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా.. కాంగ్రెస్‌ వీడిన వారందరూ మళ్లీ హస్తం గూటికి వస్తారు అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

దీంతో, రాజగోపాల్‌రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh