Bandar port: నేడు బందరు పోర్టుకు ఏపీ

Bandar port:

Bandar port: నేడు బందరు పోర్టుకు ఏపీ సీఎం శంకుస్థాపన

Bandar port: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారు.

బందరు పోర్టుకు 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

అదే పోర్టుకు 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

ఇప్పుడు మరోసారి జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేనున్నారు.

ఈ కార్యక్రమం కోసం సీఎం జగన్.. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి బయలుదేరి బందరు మండల పరిధిలోని తపసిపూడి గ్రామానికి చేరుకుంటారు.

అయితే రెండున్నరేళ్లలో ఈ పోర్టును పూర్తి  చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.

ఈ ప్రాజెక్టు రూ.5.156 కోట్లతో నిర్మితం కానుంది.

అయితే ఇప్పటికే భూసేకరణ పూర్తయ్యింది. బందరు పోర్టు కోసం 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేయాలని అంచనాకు వచ్చారు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం రుణం ఇచ్చేందుకు కూడ ఆమోదం లభించింది.

పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజ చేసి… పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో జడ్పీ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానానికి వెళ్లి అక్కడ ఆల్రెడీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.

కార్యక్రమం అనంతరం సీఎం జగన్‌ మచిలీపట్నం Bandar port:  నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

5.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌-కంటైనర్‌తో

ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24-30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పోర్టు పనుల పూర్తితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది.

వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.

ఇక ఈ పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్,

నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారనుంది.

కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా 2025-26 నాటికి అదనంగా మరో 110 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిచ్చేలా కొత్తగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు సమీపంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 4,000 ఎకరాల సాల్ట్‌ భూములను ప్రభుత్వం గుర్తించింది.

అలాగే  తీర ప్రాంతం మరియు పోర్టు పరిసర ప్రాంతాల పారిశ్రామికీకరణ దిశగా అడుగులు వేయడంతోBandar port:  పాటు

పోర్టు అనుసంధానిత లాజిస్టిక్స్‌ ఏర్పాటు ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం లభించనుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh