BCCI Selectors చీఫ్ సెలెక్టర్‌గా ఆ మాజీ ఆల్‌రౌండర్! త్వరలోనే పేరు ఖరారు చేయనున్న బీసీసీఐ
BCCI Selectors ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వైఫల్యంతో టీమిండియాలో ప్రక్షాళనలు మొదలయ్యాయి. జట్టుతో పాటు సెలెక్షన్ కమిటీలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కాగా శుక్రవారం (నవంబర్ 19) సోషల్ మీడియా ద్వారా సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. అలాగే కొత్త కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.
దీంతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని నిన్న తొలగించిన తర్వాత, సెలక్షన్ కమిటీ చీఫ్ పదవికి అజిత్ అగార్కర్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అజిత్ అగార్కర్ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సెలక్షన్ కమిటీలో అతనికి చోటు దక్కలేదు.
అయితే ఈసారిమాత్రం అజిత్ అగార్కర్‌కు ఏకగా చీఫ్ సెలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అగార్కర్‌తో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరపలేదు.కాగా టీమిండియా తరఫున 26 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అజిత్ అగార్కర్ 58 వికెట్లు పడగొట్టాడు. అలాగే 191 వన్డే మ్యాచ్‌ల్లో 288 వికెట్లు తీశాడు.
4 టీ20 మ్యాచుల్లో 3 వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్లో 32 మ్యాచ్‌లు ఆడిన అజిత్ 29 వికెట్లు తీయగలిగాడు. అగార్కర్‌తో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్, మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ, సలీల్ అంకోలాలను సెలెక్షన్ కమిటీ సభ్యులుగా నియమించవచ్చని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
2.Sanju Samson ఏ పాపం చేశాడు?
టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. టీ20 ప్రపంచకప్ వైఫల్యం అనంతరం సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించగా.. బీసీసీఐ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. సీనియర్లు లేని ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ తుది జట్టులో ఆడటం ఖాయమని భావించిన అతని అభిమానులకు వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని టీమ్‌మేనేజ్‌మెంట్ గట్టి షాక్ ఇచ్చింది. సంజూ శాంసన్‌కు బదులు దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్‌లకు అవకాశం ఇచ్చింది.
ఈ ఇద్దరూ కూడా ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. దాంతో సంజూ శాంసన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏళ్లు గడుస్తున్నా.. కెప్టెన్లు మారుతున్నా.. సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడం మాత్రం మారడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీపక్ హుడాకు ఎన్ని అవకాశాలిస్తారని ప్రశ్నిస్తున్నారు. అతని కంటే సంజూ శాంసన్ ఆడించినా జట్టుకు మేలు ఉండేదని కామెంట్ చేస్తున్నారు. సంజూ శాంసన్ పట్ల ఇంత వివక్ష ఏంటో తమకు అర్థం కావడం లేదని, అతను చేసిన పాపం ఏంటని మండిపడుతున్నారు.
రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నా.. అతనికి అండగా నిలుస్తున్నారని, అలాంటి మద్దతు సంజూ శాంసన్‌కు ఇచ్చి ఉంటే టీమిండియా కెప్టెన్ అయ్యేవాడని అభిప్రాయపడుతున్నారు.ఇన్ని రోజులు అవకాశాలిచ్చినా రాణించని ఆటగాళ్లను పక్కనపెట్టాలని, సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు అండగా నిలవాలని మరికొందరు సూచిస్తున్నారు. కొందరైతే సంజూ శాంసన్‌ను పక్కనపెట్టేందుకు బీసీసీఐకి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుతున్న బీసీసీఐ..
సంజూ శాంసన్‌ను టార్చర్ చేస్తుందని మండిపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ కోల్పోయినా.. బీసీసీఐకి సిగ్గురాలేదని చురకలంటిస్తున్నారు. ద్వితీయ శ్రేణి జట్టులో కూడా సంజూకు చోటు దొరక్కపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది.
సూర్యకు తోడుగా ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సంజూ శాంసన్‌కు బదులు జట్టులోకి వచ్చిన దీపక్ హుడా(0) గోల్డెన్ డకౌటవ్వగా.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషభ్ పంత్(6) మరోసారి నిరాశపరిచాడు.
3.న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యాన్నే పెట్టిన భారత్.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన స్కై..
న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగనూయి బే ఓవెల్ మైదానంలో అదివారం ఆ దేశంతో భారత్ తన రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ అడుతోంది. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాంటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులను చేసి 6 వికెట్లను కోల్పోయింది. ఈ రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన ఆటగాళ్లంతా నిరాశపరిచారు.
అయితే భారత్ జట్టు ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషాన్ ఒకింత పర్వాలేదన్నట్లుగా మెప్పించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్ ను మరోసారి చూపించాడు. పరిమిత ఓవర్ల ఆటలో న్యూజిలాండ్ బౌలర్లను అపరిమితంగా ఆడేసుకున్నాడు అంటే అతిశయోక్తి కానే కాదు. కేవలం 49 బంతులలోనే సెంచరీని బాది, తన కెరీర్ లో రెండో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 51 బంతులకు అతను 111 పరుగులను చేసి అజేయంగా నిలిచాడు.భారత జట్టు తొలుత సాంజూ సామ్సన్ ను పక్కన పెట్టి ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ తో బ్యాటింగ్ కు వెళ్లింది.
మొదట కొంత దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను తొమ్మిదో ఓవర్లో వెనుదిరిగాడు. ఇష్ సోధీ విసిరిన తొమ్మిదో ఓవర్ మొదటి బంతిని కట్ షాట్ ఆడుతూ తన వికెట్ కోల్పోయాడు ఇషాన్. ఔట్ అయ్యేసరికి స్ట్రైక్ రేట్ 116.13 తో.. 31 బంతులకు 36 పరుగులను చేశాడు. అతనితో పాటు దిగిన రిషభ్ పంత్ 13 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్ కూడా బ్యాటింగ్ చేయలేక 9 బంతుల్లో 13 పరుగులు మాత్రమే సాధించి తన వికెట్ కోల్పోయాడు.
శ్రేయాస్ అయ్యర్ రెండు సిక్సర్లు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడనిపించినా దురదృష్టవశాత్తు వెనువెంటనే ఔటయ్యాడు. 32 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 17 బంతులలోనే తర్వాతి అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ తరఫున 20వ ఓవర్ లో బౌలింగ్ చేసేందుకు సీనియర్ బౌలర్ టిమ్ సౌధీ బాల్ అందుకుని ముందుకు వచ్చాడు. అప్పటికే మూడు ఓవర్ల బౌలింగ్ చేసిన అతను ఒక్క వికెట్ కూడా తీయకుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 20వ ఓవర్ లో తన బంతికి పదును బాగా పెట్టుకుని వచ్చినట్లున్నాడు.
మొదటి రెండు బంతులలో రెండు, రెండు పరుగులను ఇచ్చిన అతను మూడో బంతికి హార్దిక్ పాండ్యా వికెట్ పడగొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడాను కూడా పెవీలియన్ బాట పట్టించాడు వెనువెంటనే. అనంతరం బ్యాటింగ్ కోసం వచ్చిన వాషంగ్టన్ సుందర్ వికెట్ కూడా తీసుకున్న సౌధీ తన, ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాతి బంతికి కేవలం ఒక పరుగే ఇచ్చి భారత ఇన్నింగ్స్ ముగించాడు.
4.నేటి నుంచే ఫుడ్‌బాల్ వరల్డ్ కప్.. ఎడారి దేశంలో ‘ఫిఫా’ తఫాను..!
ప్రస్తుతం క్రీడాభిమానుల కళ్లన్నీ ‘ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్’పైనే. అవును.. మరికొన్ని గంటల్లోనే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. దాదాపు నెలరోజుల పాటు జరిగే ఈ ఫుట్‌బాల్ పోటీల్లో 32 దేశాలకు చెందిన ఆటగాళ్లు.. 64 మ్యాచుల్లో తలపడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించేందుకు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేసింది. 29 రోజుల పాటు కళ్లార్పకుండా చూసేందుకు, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు సర్వత్రా సిద్ధమైపోతున్నారు. ఇప్పటి వరకు ఫుట్‌బాట్ ప్రపంచంలో దాదాపు 21 వరల్డ్‌కప్‌లు జరిగాయి. ఈ ఏడాది (2022) 22వ ఫుట్‌బాట్ ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి.
ఎడారి దేశమైన ఖతర్ దేశ రాజధాని వేదికగా సుమారు 16 లక్షల కోట్ల బడ్జెట్‌తో పుట్‌బాల్ సంబరాలు అంబరాన్నంటనున్నాయి. ఐతే ఈ ఏడాది వరల్డ్ ఫుడ్‌బాల్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన ఖతర్ పోటీలు మాత్రం కొంతమేర ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఖతర్‌లో ఇసుక తుఫాన్లు అధికంగా తలెత్తుతుంటాయి. మరోవైపు బడ్జెకు మించి ఖర్చులు పెరిగిపోయాయి. ఖతర్ ఈ టోర్నమెంట్ బాధ్యతలు ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తుందనే విషయంపై కొంత సందేహంకూడా లేకపోలేదు. ఐతే ఫిపా టోర్నీ ఖతర్‌లో నిర్వహించడం ఇదేం తొలిసారి కాదు.
2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్‌లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్–దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో ‘ఫిఫా’ ప్రపంచ కప్ పోటీలు నిర్వహించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఓ మిడిల్ ఈస్ట్రర్న్ కంట్రీ ప్రపంచవ్యాప్త క్రీడాపోటీలకు వేదిక కావడం మాత్రం ఇదే తొలిసారి.32 టీమ్‌లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్ కప్ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయని సమాచారం.
మొత్తం 8 స్టేడియాలు, ప్రాక్టీస్ మైదానాలన్నీ 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ప్రతీ మ్యాచ్‌కు విమానాల్లో ప్రయాణించవల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసిన ఖతర్ తొలిరోజు ఈక్వెడార్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఖతర్ జాతీయ దినోత్సవమైన డిసెంబర్ 18న జరుగుతుంది.