వీరసింహరెడ్డితో ..వెనక్కి తగ్గిన వీరయ్య… బరిలోకి వారసుడు..

తెలుగు ఇండస్ట్రీ లో వ‌చ్చే సంక్రాంతి స‌మ‌రం ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో చూస్తూనే ఉన్నాం. ఇద్ద‌రు హెమా హేమి హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ న‌టిస్తోన్న రెండు క్రేజీ ప్రాజెక్టులు వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండూ థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల‌కు పోటీగా కోలీవుడ్ స్టార్‌హీరో విజ‌య్ న‌టిస్తోన్న వార‌సుడు సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. మామూలుగా విజ‌య్ మన తెలుగు హీరో కాదు .. ఇది డ‌బ్బింగ్ సినిమా లెక్క‌… దీనిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు… అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ మ‌న తెలుగు టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు(Dilraju). తెలుగు, త‌మిళ భాష‌ల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు తెలుగు డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి డైరెక్టర్ కాగా.. ర‌ష్మిక మంద‌న్న కథానాయిక . అందుకే ఈ సినిమాను కూడా ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాల‌కు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. పైగా దిల్ రాజు చేతిలో ఆంధ్ర , నైజాంలో మంచి థియేట‌ర్లు ఉండ‌డంతో ఇప్పుడు చిరంజీవి ,బాలయ్య బాబు సినిమాల‌ను మించి టాప్ థియేట‌ర్లు అన్నీ వారసుడికే ఇవ్వబోతున్నారు .వాల్తేరు వీర‌య్య‌..వీర‌సింహారెడ్డి రెండు సినిమాల రైట్స్ ఎవ్వ‌రికి ఇవ్వ‌కుండా, మైత్రీ మూవీస్ వాళ్లు సొంతం గా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇది కూడా దిల్ రాజు కోపానికి కార‌ణం అవ్వడంతో దిల్ రాజు ఎక్క‌డా వెనక్కి తగ్గేదే లే అంటున్నారు… ఇక ఈ ట్రైయాంగల్ ఫైట్ లో వార‌సుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.. ప్రపంచ వ్యాప్తం గా వార‌సుడును జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్ అనౌన్సమెంట్ వ‌చ్చేసింది. ఈ మూవీని ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ చేస్తోన్న శ్లోక ఎంట‌ర్టైన్‌మెంట్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది.కానీ ,అదే రోజు బాల‌య్య కొత్త మూవీ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అంటే బాల‌య్య సినిమా, విజ‌య్ సినిమా ఒకే రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ పడబోతున్నాయి . ఆ తరువాతి రోజు చిరంజీవి కొత్త సినిమా కూడా రానుంది. మ‌రి ఈ త్రిముఖ క్రేజీ హీరోల మూవీస్ ఎవ‌రు పై చేయి సాధిస్తార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తికరంగా చర్చ నడుస్తుంది .

Dimple Hayathi In Shankars Movie keerthi suresh