అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అరెస్ట్

Assistant director arrested online prostitution racket

ప్రస్తుత కాలం లో సినిమా అందమైన రంగుల ప్రపంచం.సినిమాల్లో నటించి మంచి  పొజిషన్ కి వెళ్ళి.  సెలబ్రెటీ హోదాతో జీవించాలని, బాగా డబ్బులు సంపాదించాలని ఇలా రకరకాల కారణాలతో యువతులు సినీ ఇండస్ట్రీవైపు ఆకర్షితులవుతున్నారు. అవకాశాలు రాక కొందరు,మరికొందరు  వచ్చిన అవకాశాలు అంతంతమాత్రంగా ఉండడంతో మరి కొందరు. అలాగే  సినిమా అవకాశాల పేరుతో యువతలు మోసపోతున్న వారి సంఖ్య కూడా ఏ మాత్రం తగ్గడలేదు. తాజాగా ఒక తెలుగు టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెం ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు అవకాశాల పేరుతో భారీ సంఖ్యలో యువతులను మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ  విషయం హైదరాబాద్ లో ఆన్లైన్ వ్యభిచారం ముఠా గుట్ట రట్టు కావడంతో వెలుగులోకి వచ్చింది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ సహా మరొక వ్యక్తి అఖిల్ రెడ్డిని అరెస్ట్ చేశారు.అసలు  వివరాల్లోకి వెళ్తే  టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా 2017 నుంచి సురేష్ బోయిన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. సురేష్ తనకు సినీ పరిశ్రమలో అనేక పరిచయాలున్నాయని. అవకాశం ఇప్పిస్తామని అమ్మాయిలను ట్రాప్ చేశాడు. అనంతరం ఆ యువతులను వ్యభిచారంలోకి దింపి ప్రముఖుల వద్దకు ఆ యువతులను పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అతనిపై కన్నేసిన పోలీసులు అమ్మాయిల ఫోటోలను ఆన్లైన్లో పెట్టి వ్యభిచారం చేస్తున్నట్లుగా గుర్తించారు. 500 మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తూ గోవా, బెంగళూరు వంటి నగరాలకు సైతం యువతులను విటుల వద్దకు పంపిస్తున్నట్లు గుర్తించారు. సినిమా అవకాశాల పేరుతో తెలుగు అమ్మాయిలను మాత్రమే కాదు ముంబై, ఢిల్లీ, బెంగాల్ సహా అనేక ప్రాంతాల యువతులను కూడా రంగంలోకి దింపి వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు  సమాచారం.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh