RGVని ఫాలో అయిపోతున్న అషూ.
ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఆర్జీవి ఇచ్చే ఆన్సర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరైనా మంచి సినిమాలు తీయొచ్చు కదా సర్ అంటే నచ్చితే చూడు, లేకపోతే మానెయ్ నేను చూడమని కాలి వేళ్లను నోట్లో పెట్టుకుని మరి జుర్రేసాడు. దీంతో ఆర్జీవి- అషూ రెడ్డి ఎపిసోడ్ తెగ వైరల్ అయింది. ట్రోలింగ్ కూడా గట్టిగానే నడిచింది. ఆ తర్వాత నుంచి అషూ డిఫరెంట్ డిఫరెంట్‌గా పోస్ట్‌లు పెడుతుంది. అయితే ప్రస్తుతం ఆర్జీవి అషూ గుడ్డిగా ఫాలో అయిపోతు వున్నట్లు వుంది. అప్పటి అషూరెడ్డి వేరు.. ఆర్జీవి ఎపిసోడ్ తర్వాత అషూ వేరు. ఏంటి వేరు ఇప్పుడు అషూ కూడా ట్రోలింగ్‌కు డోంట్ కేర్ అంటూ నచ్చినట్లు పోస్ట్‌లు పెడుతుంది. లేటెస్ట్ పోస్ట్‌లో అయితే “నా బ్యాక్ అంటే జనానికి ఇష్టం.. అందుకే నా వెనుక మాట్లాడతారు” అంటూ ఓ క్యాప్షన్ పెట్టి తన ఫొటోను షేర్ చేసింది అషూ. ఇక ఇది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. “ఆర్జీవి ఎపిసోడ్ తర్వాతే అషూ ఇలా అయిపోయింది, నీకు ఏమైంది అషూ, ఆర్జీవి నిన్ను మార్చేశాడు, ఎందుకు కావాలని ట్రోలింగ్‌కు మేటర్ ఇస్తాం” అంటూ ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం సినిమాలపై కాన్సట్రేషన్ చేస్తుంది అషూ రెడ్డి. రీసెంట్గా ‘పద్మవ్యూహం చక్రదరికే తెలుసు’ అనే సినిమాలో పద్మగా నటిస్తోంది అషూ. ఇందుకు సంబంధించిన డిటైల్స్‌ను ఈ మధ్య పోస్ట్ చేసింది. చక్కగా చీర కట్టుకుని అచ్చతెలుగు ఆడపిల్లగా ఇందులో కనిపించింది. దీంతో పాటు ఏ మాస్టర్ పీస్ అనే ప్రాజెక్ట్‌లో ‘ఆద్య’ అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు కూడా అషూ పోస్ట్ పెట్టింది. ఈ మద్య కాలం లో బీబీ జోడి అనే డ్యాన్స్‌షోలో కూడా మెరిసిన అషూ.. అక్కడి నుంచి మధ్యలోనే డ్రాప్ అయింది. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్‌తో జోడి కట్టిన అషూ తర్వాత షో నుంచి వచ్చేసింది.
ఇది కూడా చదవండి :