కొత్త జంటకు క్షమాపణలు చెప్పిన మెగా కోడలు

కొత్త జంటకు క్షమాపణలు చెప్పిన మెగా కోడలు

బాలీవుడ్ ప్రేమ జంట   కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వేదమంత్రాలు, అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచి, ఈ ప్రేమజంట దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఫిబ్రవరి 7న కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రల వివాహం జరిగింది.  వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లికి బాలీవుడ్ చెందిన సినీ తారలు హాజరై. తన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలానే టాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం వీరి వివాహా ఆహ్వాన లేఖలు అందాయి. అలా లేఖలు అందిన వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట కూడా ఉంది. అయితే కొన్ని కారణాల రీత్య రామ్ చరణ్ దంపతులు ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారు.   ఈక్రమంలోనే  కియారా  కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇన్‌స్టా స్టోరీస్‌లో కొత్త జంటకు కంగ్రాట్యులేషన్స్ తెలుపుతూ వీరి పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడిందని కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల కూడా కియారా దంపతులకు విషెస్ తెలియజేస్తూ. సారీ చెప్పడం వైరల్‌గా మారింది.

కియారా వెడింగ్ పోస్ట్‌పై స్పందించిన ఉపాసన ముందస్తు కమిట్‌మెంట్స్ కారణంగా వివాహానికి హాజరు కానందుకు కొత్త జంటకు క్షమాపణలు చెప్పింది. నిజానికి కియారాకు రామ్ చరణ్ ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. గతంలో చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కలిసి నటించిన ఈ బ్యూటీ  ఇప్పుడు RC15 చిత్రంలో మరోసారి చెర్రీకి జంటగా నటిస్తోంది. ఈ క్రమంలోనే చరణ్ వైఫ్ ఉపసానతో కూడా ఆమెకు మంచి  స్నేహ ఉంది .  కానీ ఈ పెళ్ళికి  వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఉపాసన ఇలా సారీ చెప్పింది.

ఇక కియారా పెళ్లి వేడుక ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఆమె పింక్ లెహంగాలో ఏంజెల్‌లా కనిపించింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రానే ఈ వెడ్డింగ్ డ్రెస్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సిద్ధార్థ్ తలపాగాతో కనిపించగా.  ఒక ఫొటోలో ఇద్దరు కూడా ఒకరికొకరు నమస్కరిస్తూ పలకరించుకున్నట్లుగా ఉంది. రెండో పిక్‌లో ఇద్దరూ నవ్వులు చిందిస్తున్నారు. మరో చిత్రంలో సిద్ధార్థ్ తన భార్య చెంపపై ముద్దు పెట్టాడు.

కొత్త జంట పెళ్లి ఫొటోలపై బాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. అభినందనల వెల్లువ మొదలుపెట్టారు చాలా అందంగా ఉన్నారు’ అంటూ కత్రినా కైఫ్, అలియా భట్ కామెంట్ చేయగా, విక్కీ కౌశల్ అభినందనలు తెలిపారు. అలాగే సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్.. పార్టీ పాపర్, ఫ్లవర్ ఎమోజీలతో కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. తమ ఫేవరెట్ జోడీ ఒక్కటవ్వడం పట్ల అభిమానులు సైతం ఇద్దరిపై ప్రేమ కురిపిస్తున్నారు. ‘

 

ఇది కూడా చదవండ:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh