AP SSC : నేడు విడుదలైన ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు

AP SSC :

AP SSC : నేడు విడుదలైన ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు

AP SSC:  ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు (శుక్రవారం) ఉదయం రిలీజ్‌ అయ్యాయి.. ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. 2.12 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు

చేసుకోగా.. వీరిలో 1.9 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్స్ రాశారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అలాగే http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో కూడా విద్యార్థులు చెక్‌ చేసుకోవచ్చు.వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పాఠశాల లాగిన్‌లో సంబంధిత విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు

అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మార్కుల జాబితాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.9  లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీళ్లలో పాసైన విద్యార్ధుల సంఖ్య 118588. టెన్త్‌ సప్లిమెంటరీ 2023 ఫలితాల్లో.. ఉత్తీర్ణతా శాతం – 63.10%,

హాజరైన బాలురు- 110210…ఉత్తీర్ణత సాధించిన బాలురు– 65372, హాజరైన బాలికలు- 77713….ఉత్తీర్ణత సాధించిన బాలికలు- 53216, బాలురు కంటే 9.16% అధికంగా బాలికల ఉత్తీర్ణత, అత్యధికంగా ప్రకాశంలో 91.21% ఉత్తీర్ణత

అయితే అత్యల్పంగా కృష్ణాలో 40.56% ఉత్తీర్ణత సాదించింది. ఈ పరీక్షలను జూన్‌ 2 నుంచి 10 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు

నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు 915 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు  ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు  నిర్వహించారు. 6 పేపర్లతో టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6లక్షల 10వేల మంది రెగ్యులర్, 55వేల మంది

ప్రైవేటు విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీలో ఏప్రిల్ 18న ఎస్ఎస్ సీ పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్‌ 19 నుంచి 26వ తేదీ వరకు వాల్యుయేషన్ జరిగింది. 35వేల మంది టీచర్లు ఈ స్పాట్ వాల్యుయేషన్ ను విజయవంతంగా నిర్వహించారు.

పరీక్షలు ముగిసిన 18 రోజుల్లోపే వాల్యుయేషన్, టేబులేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయడం విశేషం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh