AP Politics: చంద్రబాబు నాయుడు కు ఛాలెంజ్ విసిరిన రోజా

AP Politics

 Minister Roja Challenge to TDP Chandrababu: చంద్రబాబు నాయుడు కు ఛాలెంజ్ విసిరిన రోజా

AP Politics: ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుకు విసిరారు. మీ మేనిఫెస్టో తెచ్చుకో, మా మేనిఫెస్టో తెస్తాంఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని ఛాలెంజ్ చేశారు.

అప్పుడు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారో చూద్దామని సెటైర్ వేశారు. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వ్యాఖ్యానించారు.

శనివారం మీడియాతో మాట్లాడిన రోజా చంద్రబాబు ‘ప్రజల ఇంటికి వలంటీర్ వెళ్లి సంక్షేమం ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ప్రతి ఇంటికి ఎమ్మెల్యే, మంత్రులు వెళుతున్నారు. వలంటీర్ వ్యవస్థ ఒక సైనిక వ్యవస్థలాగా ఏపీ ప్రజలకు అండగా నిలుస్తోంది. అందుకే ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. ఇంట్లో ఎవరూ చూస్కోకపోయినా జగన్ ఉన్నాడనే నమ్మకంతో చాలామంది ఉన్నారు.

‘మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్‌కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ.

AP Politics: జగన్ స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ, దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఒక పది ఇళ్లకు ఇలా చేసి తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టిట్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్. మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారు.  అయితే మెగా పీపుల్స్‌ సర్వే ఒక అద్భుతమైన కార్యక్రమం. జగన్‌కు మద్దతిచ్చేందుకు అందరూ తమ వివరాలు ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక సంచలన కార్యక్రమం.

అసలు  ఓటు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాడు. యువతకు నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. రైతులకు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు. ఇలా ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. జగన్ పాలనలో అందరికీ న్యాయం చేశారు కాబట్టే ధైర్యంగా మేము జనంలోకి వెళ్తున్నాం.’ అని రోజా వ్యాఖ్యానించారు

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh