AP Politics: నోరు జారీనందుకు చిక్కుల్లో పడ్డ ఎమ్మెల్యే

AP Politics

AP Politics: నోరు జారీనందుకు చిక్కుల్లో పడ్డ ఎమ్మెల్యే రాపాక

AP Politics: 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాదరావు గెలుపొందిన సంగతి తెలిసిందే. మొదట్లో తాను జనసేన పార్టీలోనే ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపుతో ఉంటానని చెప్పిన రాపాక ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి వైసీపీ కి సపోర్ట్ గా మాట్లాడటం మొదలు పెట్టారు.   అలాగే  తన కుమారుడిని కూడా వైసీపీలో చేర్పించారు. పలు సభలు సమావేశాల్లోనూ మెడలో వైసీపీ జెండాలతో రాపాక కనిపించారు.

ఈ ఏడాది మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడుతూ పూర్వం నుంచి చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్ లో తనకు దొంగ ఓట్లు పడేవని తెలిపారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేసేసేవారన్నారు. దీంతో తనకు చింతలమోరి గ్రామంలో ఏడు నుంచి ఎనిమిది వందల వరకు మెజారిటీ వచ్చేదంటూ అదేదో ఘనకార్యమన్నట్టు రాపాక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యింది.  అయితే రాపాక చేసిన వ్యాఖ్యలపై రాజోలు నియోజకవర్గం కేశవదాసుపాలెంకు చెందిన ఎనుముల వెంకటపతి రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాపాకపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే  రాపాక చేసిన ఈ వ్యాఖ్యలను ఈ మెయిల్ రూపంలో ఆధారాలతో సహా సీఈవోకు పంపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక.. దొంగనోట్లతో తాను గెలిచినట్లు చెప్పడాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆయన సీఈవోను కోరారు.

అయితే ఈ ఫిర్యాదుపై స్పందించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) ఈ ఫిర్యాదుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. రాపాక ఉదంతంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో ఈ నివేదిక సమర్పించాలని సూచించారు.

అలాగే  2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజోలులో గెలిచిన రాపాక 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున సీటు దక్కకపోవడంతో జనసేన నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh