ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకి శుభవార్త చెప్పింది. డిసెంబరు 12 నుంచి రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను బదిలీ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వారి అనుగుణమైన పాఠశాలలకు వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభమవుతుంది. బదిలీల తుది జాబితాను జనవరి 12న విడుదల చేయనున్నారు.మునిసిపల్ ఉపాధ్యాయులకు ఇతర ఉపాధ్యాయులకు బదిలీలకు అవకాశం కల్పించలేదు.
గురు, శుక్రవారాల్లో నిర్వహించిన సమావేశం లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని ప్రకటించారు. దివ్యాంగులు, స్పౌజ్,ఒంటరి మహిళలు ఇతరత్రా వారి సర్వీస్ మరియు స్కూల్ స్టేషన్ పాయింట్లు అలాగే ఉంటాయి, అయితే ఉపాధ్యాయుల బదిలీ తర్వాత మిగిలిన స్థానాలకు దరఖాస్తు చేసుకున్న DSC-98 అభ్యర్థులకు కొత్త పోస్టింగ్లు ఇవ్వబడతాయి.
ఉపాధ్యాయుల బదిలీల అనంతరం జిల్లా విద్యాధికారుల బదిలీలు కూడా జరగనున్నాయి. ఇతర జిల్లాల్లోని జిల్లా విద్యాధికారులను భర్తీ చేయనున్నారు.