భారత్ యంగ్ ఓపెనర్ డబల్ సెంచరీ తో సంచలనం – ఇషాన్ కిషన్.

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత యువ స్టార్ ఇషాన్ కిషన్ సంచలనం సృష్టించాడు. పట్ట పగలే బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించి, కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. అతను 131 బంతుల్లో 24 బౌండరీలు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేశాడు. అతను రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ మరియు వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు.

ఇషాన్ కిషన్ 5 మ్యాచ్‌లు తరువాత మళ్లీ ఒన్డే జట్టులోకి వచ్చి సెంచరీ సాధించాడు. ఇది అతని మొదటి అంతర్జాతీయ సెంచరీ. అదే ఫార్మ్ తో 131 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, మరియు గౌతమ్ గంభీర్‌లు బంగ్లాదేశ్‌లో సెంచరీలు చేసిన భారతీయ క్రికెట్ ఆటగాళ్లు. ఈ డబల్ సెంచరీ తో ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా కిషన్ నిలిచాడు.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh