మంత్రి రోజాను గాలి భానుప్రకాష్ అంత మాటనేశాడు ?

andhra pradesh ap news gali bhanu.

మంత్రి రోజాను గాలి భానుప్రకాష్ అంత మాటనేశాడు ?

ఏపీలో  వైసీపీ  మంత్రి రోజా పై టీడీపీ ఇంచార్జి గాలి భానుప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా ఎలా మంత్రి అయిందో అర్థం కాలేదని విమర్శించారు. చంద్రబాబు  పై అనేక సిట్‌లు వేశారు. అయిన ఏమి చెయ్యలేక పోయారని పేర్కొన్నారు. సీబీఐ విచారణ చేయమని రోజా ప్రెస్‌మీట్ పెట్టడం కాదని, సీబీఐకి లేఖ ఇవ్వాలని ఆయన  డిమాండ్ చేశారు.

అంతకంటే ముందు ఆమె తన ఐటీ రిటర్న్స్ అన్ని బయట పెట్టాలని సూచించారు. అలాగే రోజా నగరికి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.అసలు ఆమె నిత్య పెళ్లి కూతురు,ఇంకా దైవ మహిళ లాగా మాట్లాడుతుందని మండిపడ్డారు. మన్నారగుడి గ్యాంగ్ లాగా ఆమె కుటుంబ సభ్యులు తయారయ్యారని గాలి  విమర్శించారు.ఈ  రక్కసి నుంచి విముక్తి కోసం నిన్న జనం వేలాదిగా తరలి వచ్చారని చెప్పారు. జగన్ ఒక్క ఛాన్స్ అన్న దానివల్ల గెలిచిందని, ఆమెను చూసి ఎవ్వరు ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు. ఆడ పడుచులకు తలవంపులు తెచ్చేలా అసెంబ్లీలో నడుచుకుంటోందన్నారు. ఇసుక, మట్టి, గంజాయి, మద్యం అన్ని మాఫియాలకు రోజా దోపిడీ ఉందని ఆరోపించారు. దొంగ డాక్యుమెంట్స్  లతో భూముల దోపిడీకి పాల్పడుతూ ప్రతి చిన్న పనికి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. తాము వస్తే ఇసుక, గజాయ్, భూ కబ్జాలు చేయమన్నారు.

లోకేష్ పాదయాత్ర శిబిరంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ నగరి టీడీపీ ఇంచార్జి గాలి భానుప్రకాశ్ మాట్లాడారు. తాను ప్రజల మధ్యే ఉంటానని నగరిలోనే చావాలని డిసైడ్ అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నట్లు వెల్లడించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే మూతి పగిలిపోతుందని ఎమ్మెల్యే రోజా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని. చూసుకోవాలంటూ భానుప్రకాష్‌కు ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్న వారే టీడీపీ నేత గాలి భానుప్రకాష్‌కు అండదండలు అందిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh