NTR: ఎన్టీఆర్ గురించి ట్వీట్ .. పొరపాటు చేసిన నటి..

NTR: ఎన్టీఆర్ గురించి ట్వీట్ .. పొరపాటు చేసిన నటి..

ఆర్ఆర్ఆర్ ‘ తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఎన్టీఆర్ గురించి ట్వీట్ చేసి ఓ బాలీవుడ్ బ్యూటీ సోషల్మీడియాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఎన్టీఆర్ని ట్యాగ్ చేయడానికి బదులు వేరే నెటిజన్ ఖాతాను ఆమె జత చేస్తూ ఈ ట్వీట్ చేశారు . దీంతో పలువురు నెటిజన్లు ఎన్టీఆర్ ఖాతా అది కాదని .. సరి చూసుకోవాలని వరుస పోస్టులు పెడుతున్నారు . ఇంతకీ ఆ నటి ఎవరంటే .. ?

త్రో బ్యాక్ వీకెండ్ అంటూ ఎన్టీఆర్ తో కూడిన రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది అమీషా పటేల్. సదరు ఫోటోకి ఆమె పెట్టిన కామెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 2005లో బి. గోపాల్ దర్శకత్వంలో నరసింహుడు మూవీ విడుదలైంది.

 

 

యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన నరసింహుడు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అమీషా పటేల్, సమీరా రెడ్డి హీరోయిన్స్ గా నటించారు. అమీషా ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించారు.

ఆ చిత్రంలోని రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన అమీషా పటేల్… ”ఎన్టీఆర్ తో క్యూట్ త్రో బ్యాక్ ఫోటో. అప్పట్లో ఆయన సూపర్ స్టార్. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా దేశవ్యాప్తంగా ప్రేమను సంపాదించడం నాకు సొంతోషాన్ని కలిగిస్తుంది.

ఆయన లవ్లీ కో స్టార్. చాలా ఒదిగి ఉండే హార్డ్ వర్కింగ్ స్టార్…” అని కామెంట్ పెట్టారు. ఎన్టీఆర్ పట్ల అమీషా పటేల్ స్పందించిన తీరుకు ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ట్వీట్ని ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా @ tarak9999 కు ట్యాగ్ చేయడానికి బదులు @jrntr పేజీకి జత చేశారు .

దీన్ని గమనించిన పలువురు నెటిజన్లు .. ” మేడమ్ తారక్ అన్న ట్విటర్ ఖాతా వేరు .. ఒక్కసారి మీరు సరి చూసుకోండి ” అని రిప్లైలు ఇచ్చారు . నెటిజన్లు పెట్టిన కామెంట్స్ చూసిన అమీషా మరోసారి అదే సందేశాన్ని ట్వీట్ చేస్తూ .. మళ్లీ అదే ఖాతాను ట్యాగ్ చేశారు . అలా , ట్యాగింగ్లో రెండు సార్లు తప్పులు దొర్లడంతో చేసేది లేక .. మూడోసారి కేవలం ఎన్టీఆర్ పేరుని మాత్రమే ఉంచి , ట్యాగింగ్ లేకుండా జాగ్రత్త పడ్డారామె

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh