Revanth reddy-దారులన్నీ తుక్కుగూడ వైపే..

All roads lead to Tukkuguda..Congress releases national manifesto..

దారులన్నీ తుక్కుగూడ వైపే..కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను విడుదల..

Revanth reddy-దారులన్నీ తుక్కుగూడ వైపే…..రంగారెడ్డి జిల్లా నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది తెలంగాణ కాంగ్రెస్‌. తుక్కుగూడలో ఇవాళ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా.. కాంగ్రెస్‌ అగ్రనేతలంతా హాజరుకానున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో స్పీడ్‌మీదున్న టీకాంగ్రెస్‌, లోక్‌సభ ఎన్నికలకు మరింత జోరుగా సన్నద్ధం అవుతోంది. తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో ఇక్కడ్నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టి ఘనవిజయం సాధించింది కాంగ్రెస్‌. అప్పుడు ఎక్కడ్నుంచి ఎన్నికల శంఖారావం పూరించిందో… ఇప్పుడు అదే వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది తెలంగాణ

AICC చీఫ్‌ ఖర్గేతోపాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరవుతుండటంతో తుక్కుగూడ సభపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. 10లక్షల మందిని తరలించేందుకు ప్రణాళికలు రచించింది టీకాంగ్రెస్‌. తెలంగాణవ్యాప్తంగా అన్నిగ్రామాలు, ప‌ట్టణాలు, న‌గ‌రాల నుంచి ప్రజ‌లను పెద్దఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. Revanth reddy-దారులన్నీ తుక్కుగూడ వైపే..

నిన్న లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన హస్తం పార్టీ, ఇవాళ తుక్కుగూడ జనజాతర సభలో తెలుగులో మేనిఫెస్టోని ప్రకటించబోతోంది. అదే సందర్భంలో కాంగ్రెస్‌లో చేరికలు ఊపందుకోబోతున్నట్లు లీకులు ఇస్తున్నారు. సుమారు 12మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకుంటారని చెబుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది అధికార కాంగ్రెస్‌ పార్టీ.. తుక్కుగూడలో సాయంత్రం 5:30 గంటలకు జనజాతర కాంగ్రెస్‌ బహిరంగ సభ ప్రారంభంకానుంది. ఈ వేదికపై రాహుల్‌ గాంధీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌.

తుక్కుగూడ‌లోని  జ‌నజాత‌ర బ‌హిరంగ స‌భ‌

తుక్కుగూడ‌లోని 70 ఎక‌రాల విశాల‌మైన మైదానంలో జ‌నజాత‌ర బ‌హిరంగ స‌భ‌ జరగనుంది. వాహ‌నాల పార్కింగ్‌కు సుమారు 550 ఎక‌రాల స్థలాన్ని కేటాయించారు. ఈ స‌భ‌కు ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు అన్నిగ్రామాలు, ప‌ట్టణాలు, న‌గ‌రాల నుంచి ప్రజ‌ల్ని తరలించడానికి ఏర్పాట్లు చేశారు.జన జాతర సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 60 ఎకరాల్లో సభా ప్రాంగణం, 700 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ అవకాశం కల్పించారు. వేసవికాలం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ అధిష్టానం అన్ని ఏర్పాట్లు చేసింది. 2023 సెప్టెంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి ఆరు గ్యారంటీలు సోనియాగాంధీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పచ్చిస్ గ్యారంటీ పేరుతో ఐదు రకాల ప్రధాన హామీలు కాంగ్రెస్ అగ్రనేతలు ఇవ్వనున్నారు. మేనిఫెస్టోలో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వంద రోజుల పాలన విజయాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రజలకు ఏఐసీసీ అగ్రనేతలు సభలో వివరించనున్నారు. తుక్కుగుడా సభతో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టనుంది.

Image

 

 

For more information click here

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh