ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ ఖరారు…
కడప జిల్లా లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ ఖరారు అయ్యింది. కాబట్టి ఎన్నికల నిర్వహణకు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని బోర్డ్ రూమ్ నుండి కేంద్ర ఎన్నికల కమీషన్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన తరుణంలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై, జిల్లా అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు వీసీ ద్వారా ఆర్డీఓ, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లాలో జరిగిన ఎన్నికల విజయవంతంగా జరగడానికి ఏ విధంగా కృషి చేశారో అదే స్ఫూర్తితో ప్రస్తుతం జరిగే.. ఎన్నికలను కూడా పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.నిర్దేశించిన తేదీల్లో ఎన్నికల నిర్వహణపై పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల విధులకు నియమించిన అధికారులందరూ తప్పకుండా శిక్షణకు హాజరుకావాలన్నారు.ఒకవేళ హాజరుకాకపోతే వారి మిద కఠిన చర్యలు తీసుకుంటామున్నారు. పోలింగ్ సిబ్బందిని వారి సొంత మండలంలో కానీ, వారు విధులు నిర్వహించే మండలానికి కానీ,ఎన్నికల విధులు కేటాయించ కూడదన్నారు.
పోలింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని వసతులతో పాటు. భద్రతగా ఏర్పాట్లను కూడా సంసిద్ధం చేసుకోవాలన్నారు.ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూము, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కౌంటర్లు, నార్మల్ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, తదితర ప్రాంతాలవద్ద నియమ నిబంధనల మేరకు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక సూచనల మేరకు.. కోవిడ్ -19 ప్రోటోకాల్ ను పాటించాలన్నారు.
ఎన్నికల మోడల్ కోడ్ నియమావళిని తూచా తప్పక అందరూ పాటించాలన్నారు ప్రతి పోలింగ్ కేంద్రానికి వీడియోగ్రాఫర్, సూక్ష్మ పరిశీలకులను నియమించాలన్నారు. ర్యాండమైజేషన్. పద్ధతి ద్వారా పోలింగ్ సిబ్బందికి ఎన్నికల విధులను కేటాయించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ.. గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సక్రమంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులందరికి కేటాయించిన విధులను తప్పక పాటించాలన్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో డూప్లికేషన్, అర్హత లేని వారుంటే వెంటనే తొలగించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలని, రాజకీయ నేతల విగ్రహాలను కప్పి ఉంచాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నేటి నుండి అమలులో ఉంటుందని ప్రభుత్వ అధికారులందరూ ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: