Adipurush :ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

Adipurush

Adipurush :ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

 

Adipurush : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న  విడుదల అయ్యిన విషయం తెలిసిందే . అయితే  ఎన్నో భారీ  అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. ఐదు భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చాలా వాయిదాల తర్వాత జూన్ 16న విడుదలైంది. రాఘవ్ గా ప్రభాస్ నటించిన ఈ సినిమా తొలిరోజే వీఎఫ్ఎక్స్, డైలాగులతో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తన పాత్రకు న్యాయం చేశాడని కూడా కొందరు భావించారు. ఆదిపురుష్ కు థియేటర్స్ లో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయని మొదటి రోజు అంచనాలు చెబుతున్నాయి. అన్ని భాషల్లోనూ ఈ సినిమా తొలిరోజు రూ.100 కోట్లు టచ్ చేసే అవకాశం ఉంది.

హిందీలో రూ.35 కోట్లు, తెలుగులో రూ.58.50 కోట్లు, మలయాళంలో రూ.0.40 కోట్లు, తమిళంలో రూ.0.70 కోట్లు, కన్నడలో రూ.0.4 కోట్లు రాబట్టినట్లు సక్నిల్క్ అంచనా వేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం వసూళ్లు సుమారు రూ.95 కోట్లు. అసలు లెక్కలు ఇంకా రావాల్సి ఉంది

 

వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో వీరు వరుసగా రాఘవ, జానకి, లంకేష్ పాత్రలను పోషిస్తున్నారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం ఆదిపురుష్. రెండేళ్ల కాలంలో ఈ సినిమా పలు వాయిదాలు, వివాదాలు ఎదుర్కొంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh