Ap Govt : తల్లుల ఖాతాలలోకి అమ్మఒడి నగదు జమ
Ap Govt : వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో అమ్మఒడి ఒకటి. విద్యార్థులను బడి బాట పట్టించేందుకు ప్రోత్సాహకంగా ఈ పథకం కింద, పిల్లల తల్లుల ఖాతాలో ఏటా రూ.15వేలు జమ చేస్తోంది ప్రభుత్వం.
అయితే 2022-23 పథకం అమలుకు ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. తమ పిల్లలను పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఈ నెల 28న అమ్మఒడి నగదును జమ చేయనుంది.
అయితే పిల్లల చదువులకు పేదరికం అడ్డంకి కాకుండా సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్ధులకు అమ్మ ఒడితో లబ్ధి చేకూరుస్తున్నారు.
అలాగే కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి/సంరక్షకుడు ఏటా రూ.15 వేలు చొప్పున పొందచ్చని పేర్కొంది.
కానీ NPCI మ్యాపింగ్ యాక్టివ్ లేని వారు తమ బ్యాంకును సంప్రదించి యాక్టివేట్ చేసుకోవాలి.
లేదంటే అర్హత ఉన్నా ప్రభుత్వం విడుదల చేసే అమౌంట్ ఖాతాలో పడదు. కాబట్టి బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ మ్యాపింగ్ యాక్టివ్ ఉందో లేదో తెలుసుకోవాలి.
ఎన్నికల సమయంలో సీఎం జగన్ పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు.
అలా ప్రకటించిన వాటిలో ఒకటి జగనన్న అమ్మఒడి స్కీమ్. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ.15వేలు ఇస్తోంది జగన్ సర్కార్.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, Ap Govt : అక్షరాస్యతను పెంచడమే అమ్మ ఒడి పథకం లక్ష్యమని సీఎం జగన్ చెప్పారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతోనే ‘అమ్మఒడి’ తీసుకొచ్చామని గతంలో ఆయన వివరించారు. విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చెల్లించడం ద్వారా ఎంతోమంది పేదలకు చదువుకునే అవకాశం కలుగుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.
అయితే అమ్మఒడి పథకంలో తొలి ఏడాది తల్లులకు రూ.15 వేలు జమ చేసారు. గత ఏడాది నుంచి అమ్మఒడి కింద ఇచ్చే రూ 15 వేల నుంచి పాఠశాల..టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 2వేలు మినహాయిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి నిధుల విడుదల సమయంలోనే స్పష్టంగా వెల్లడించారు.
గత ఏడాది 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ 13 వేలు చొప్పున నిధులు జమ అయ్యాయి. ఈ ఏడాది అదే విధంగా రూ 13 వేలు జమ చేయనున్నారు. రూ.1000 జిల్లా టాయిలెట్ నిర్వహణ నిధి(డీటీఎంఎఫ్)కి, మరో రూ.1000 జిల్లా పాఠశాలల నిర్వహణ నిధి(డీఎస్ఎంఎఫ్) ఖాతాలకు జమ చేయనున్నారు.
టెన్త్ Ap Govt : తర్వాత ఇంటర్‌లో చేరే వారికి పథకం కొనసాగుతుందని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.