2024 ఎన్నికలలోను జగన్ తోనే ప్రజలు – రోజా
ఆంధ్ర ప్రదేశ్ లో శాసనసభ సమావేయలు కొంచం వాడి వేడి గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోజా దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ప్రతిపక్ష పార్టీలపై అంతే దూకుడుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా ఈ అసెంబ్లీ సమావేశంలో పులివెందులలో వైసీపీని ఓడిస్తామంటూ టిడిపి మైండ్ గేమ్ కి తరలేపిన నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి రోజా తనదైన పంచులతో ప్రత్యర్థులపై విరుచుకుపడింది. 2024 ఎన్నికలలోకూడా ప్రజలు జగన్ తోనే ఉంటారని చంద్రబాబుది గాలి పార్టీ అని వారికి డిపాజిట్ల కూడా రావని ఎద్దేవా చేశారు. పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదని కావాలంటే చంద్రబాబును పులివెందులలో పోటీ చేసి గేలవాలని రోజా సవాల్ విసిరారు.
పులివెందులలో జగన్ కి ఎదురుగాలి ఇస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టిందుకు గాను మం త్రి రోజా ఇలా సవాళ్ళు విసిరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు లకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కోరారు మంత్రి రోజా. లోకేష్ గల్లీ గల్లీ తిరిగిన వెళ్ళగొట్టారని ఎద్దేవా చేశారు. ప్రజలు 175 నియోజకవర్గాలలో జరిగిన అన్ని ఎన్నికలలో టిడిపిని ఓడించారని సింబల్ పై ఏడేళ్ల నుంచి టిడిపి గెలిచిన దాఖలాలు లేవన్నారు. సింబల్ ఎలక్షన్లు వస్తే జగన్ కి ఓటేస్తారని అన్నారు మంత్రి రోజా. టిడిపికి అంత నమ్మకం ఉంటే లోకేష్ ను ఎందుకు పోటీలో పెట్టలేదని ప్రశ్నించారు.
కుప్పంలో జరిగిన అభివృద్ధి, పులివెందులలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించాలని మంత్రి రోజా హితవు పలికారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసినప్పటికీ చంద్రబాబు కుప్పం ను కనీస రెవిన్యూ డివిజన్ గా కూడా మార్చలేదని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు అసమర్థుడు అంటూ రోజా విమర్శలు గుప్పించారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తాము ప్రజలలో ధైర్యంగా తిరుగుతున్నామని రోజా పేర్కొన్నారు.