వాయువ్య డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని నదిలో రాత్రిపూట వస్తువులు మరియు జంతువులతో ఓవర్లోడ్ చేయబడిన మోటరైజ్డ్ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 145 మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తుంది. కాగా ఈ పడవలో సుమారు 200 మంది ప్రయాణిస్తుండగా వారిలో 145 మంది ప్రయాణికులు మరణించి నట్లు మిగిలిన 55 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.
కాగా ఈ ఘటన పై ఆ ప్రాంతంలోని సివిల్ సొసైటీ గ్రూపుల అధ్యక్షుడు జీన్-పియర్ వాగ్యులా విలేకరులతో మాట్లాడుతూ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తున్న పడవ బసంకుసు పట్టణానికి సమీపంలో లులోంగా నదిలో బోల్తా పడిందిని పేర్కొన్నారు. పడవ మునిగి పోవడానికి ఓవర్లోడ్ ప్రధాన కారణమని, ఈ ఘటనలో 55 మంది ఇప్పటి వరకు ప్రాణాలతో బయటపడ్డారని, కనీసం 145 మంది ఆచూకి ఇంక తెలియరాలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి: