టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన శర్వానంద్ ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ప్రకటన లేకుండా సడన్ గా నిశ్చితార్ధం చేసుకొని అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు రక్షితను శర్వా వివాహం చేసుకున్నాడు. రక్షిత ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. నిన్న(శనివారం ) రాత్రి 11 గంటల నుంచి అసలైన పెళ్లి తంతు మొదలైంది. రక్షిత మెడలో శాస్త్రోక్తంగా మూడు ముళ్లు వేశాడు శర్వానంద్. అలా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ, రక్షితతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు ఈ హీరో. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది శర్వానంద్ వివాహం. అయితే 2 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం లీలా ప్యాలెస్ ను అందంగా ముస్తాబు చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు ఒక రోజు ముందే ప్యాలెస్ కు చేరుకున్నారు. మెహందీ ఫంక్షన్ తో సంబరాలు షురూ చేశారు.
అలాగే శర్వానంద్ పెళ్ళికి రామ్ చరణ్, సిద్దార్థ్, నిర్మాత వంశీ, అనురాగ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇక ఇరువైపులా బంధువులు, సన్నిహితులు కూడా విచ్చేయగా సంగీత్ లో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో డోంట్ స్టాప్ డాన్సింగ్ పాటకు డాన్స్ చేశారు శర్వానంద్-రక్షిత. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవలే ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత శర్వానంద్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో ఓ క్రేజీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే శర్వానంద్, రామ్ చరణ్‌కు క్లాస్ మేట్. ఇతనితో పాటు రానా,నవదీప్‌లు క్లాస్‌మేట్స్. ఇక శర్వానంద్ తాతగారు (నాన్న వాళ్ల నాన్న) మైనేని హరిప్రసాద్‌కు సీనియర్ ఎన్టీఆర్‌కు చెందిన అకౌంట్స్ గట్రా చూసేవారు. ఈ రకంగా ఇతనికి మెగా, నందమూరి కుటుంబాలతో శర్వానంద్ ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. అలా ఇతను సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి తనకున్న పరిచయాలతో నటుడిగా, హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.