Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కి ఏమైంది?
ఐపీఎల్ 2023 సీజన్లలో కీలక ఆటగాళ్లు గాయపడడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి, వన్డే వరల్డ్ కప్‌కే అనుమానంగా మారగా ఇప్పుడు ఈ లిస్టులో సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత నెల రోజులుగా అతను విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అరంగేట్రం తర్వాత సూర్య చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ వరుసగా మూడు మ్యాచ్‌లో డకౌటై అయ్యాడు.
అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబైఇండియన్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కొట్టిన బంతిని బౌడరీలైన్ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నం సూర్య గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ జాసన్ బెహండార్ఫ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్ బాదిన అక్షర్ నాలుగో బంతిని కూడా లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు.
ఈసారి సూర్య బౌండరీ వద్ద క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే చేతి నుంచి పట్టుజారిన బంతి సూర్య కుడి కంటి పైభాగానికి తగిలింది. దీంతో కంటికి చిన్న గాయమైంది. ఫిజియో వచ్చి పరీశీలించి డగౌట్‌కు తీసుకెళ్లాడు. కంటి పైభాగంలో ఏర్పడిన గాయానికి కుట్లు పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి సూర్య గాయం ముంబై ఇండియన్స్ శిబిరంలో కాస్త ఆందోళన రేపింది. అతని గాయం గురించి అప్డేట్ రావాల్సి ఉంది.
అలాగే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన లీగ్ 16వ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటయ్యింది. ప్రత్యర్థి ఎదుట 173 పరుగుల భారీలక్ష్యం ఉంచినా తుదివరకూ పోరాడినా పరాజయం తప్పలేదు.
హోంగ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి చక్కటి ఆరంభం దక్కినట్లే కనిపించింది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ వచ్చిన డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా ధాటిగా ఆడుతూ 3 బౌండ్రీలతో 15 పరుగులు సాధించి అవుటయ్యాడు.మరోవైపు కెప్టెన్ కమ్ ఓపెనర్ వార్నర్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆడటంతో ఢిల్లీ స్కోరుబోర్డు పరుగులెత్తింది.
173 పరుగుల విజయలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబైకి ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ (45 బంతుల్లో 4 సిక్సర్లు, 6 బౌండ్రీలతో 65 పరుగుల స్కోరు సాధించాడు.
ఐపీఎల్ లో రోహిత్ కు గత రెండేళ్లలో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 6 బౌండ్రీలతో 31 పరుగులకు రనౌట్ కాగా..
హైదరాబాదీ యంగ్ గన్ తిలక్ వర్మ 28 బంతుల్లోనే 4 సిక్సర్లు, సింగిల్ ఫోర్ తో 41 పరుగులు సాధించడం ద్వారా తనవంతు పాత్ర పోషించాడు.
360 హిట్టర్ సూర్యకుమార్ మరోసారి డకౌట్ తో నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ చివర్లో పరిస్థితి ఉత్కంఠను కలిగించినా యువబ్యాటర్ కామెరూన్ గ్రీన్ (17 నాటౌట్), టిమ్ డేవిడ్ (13 నాటౌట్) జట్టును విజేతగా నిలిపారు. ముంబై కేవలం 4 వికెట్ల నష్టానికే 173 పరుగుల విజయలక్ష్యం సాధించగలిగింది.