భారీ స్కోర్ ను చేధించిన రాహుల్ సేన

ఐపీఎల్ 2023 భారీ స్కోర్ ను ఛేదించిన రాహుల్ సేన

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్స్  సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయ కేతనాన్ని ఎగురవేశారు. ఎంతో ఉత్కంట భరితంగా జరిగింది ఈ మ్యాచ్. చివరి వరకు నువ్వా నీనా అన్నటు జరిగింది మ్యాచ్. ముందుగా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటగా బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ 212/2 స్కోర్ చేసి లక్నో సూపర్ జెయింట్స్  కు బారీ స్కోర్ ను ముందు ఉంచింది.

మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ జోడీ బరిలోకి దిగింది. కోహ్లీ 44 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చగా, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి ఆర్సీబీ రన్రేట్ను ఓవర్కు 10 పరుగులకు పైగా ఉంచారు. 46 బంతుల్లో 79 పరుగులు చేయగా, మ్యాక్స్వెల్ కేవలం 29 బంతుల్లో 59 పరుగులు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  ఈ మ్యాచ్ లో ఎల్ ఎస్ జీ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పై డుప్లెసిస్ భారీ షాట్ వేశాడు. డుప్లెసిస్ వేసిన బాల్ ను డుప్లెసిస్ భారీగా కొట్టాడంతో అది చిన్నస్వామి స్టేడియం బయటకు వెళ్లింది.  మరియు గ్లెన్ మాక్స్వెల్ కూడా ఆ షాట్ చూసి షాక్ అయ్యాడు.

తరువాత బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ప్రారంభం లోనే ఒక వికెట్ కోల్పోయింది. తరువాత బరిలో దిగిన స్టాయినిస్, పూరన్ తక్కవ బాల్స్ లో అధిక స్కోర్ చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం  సాదించారు. స్టాయినిస్ 30 బంతులకు 65 పూరన్ 19 బాల్స్ లో 62 బాదోని 24 బంతులలో 30 కే ఎల్ రాహుల్ 18 బంతుల్లో 20 రన్స్ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్( వికెట్ కీపర్), అనూజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్( వికెట్ కీపర్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్.

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh